ప్రస్తుత దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో బిజెపిలో చేరి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ బిజెపి సీనియర్ నాయకుడు లోక భూపతి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. భూపతి రెడ్డి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా తన తండ్రి మాజీ పిసిసి అధ్యక్షుడు, టిఆర్ఎస్ లో పని చేసిన డి. శ్రీనివాస్ తనకు సూచించారని ఈ సందర్భంగా అర్వింద్ చెప్పారు. డి. శ్రీనివాస్ కాంగ్రెస్ లో పని చేసినా, టిఆర్ఎస్ కు వెళ్లినా ఆయన మూలాలు మాత్రం జనసంఘ్ తోనే ఉన్నాయని లోక భూపతిరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. డి. శ్రీనివాస్ తండ్రి ధర్మపురి వెంకట్రామ్ 1971 ప్రాంతంలో నే జన సంఘ్ ద్వారా 25 మంది సర్పంచ్ లు, సమితి ప్రెసిడెంట్ గెలిపించుకున్నారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారిగా పనిచేస్తోన్న లోక భూపతి రెడ్డి జనసంఘ్ జిల్లా పధికారిగా గతంలో పని చేసిన అర్వింద్ తాత ధర్మపురి వెంకట్రాం సేవలను గుర్తు చేసుకున్నారు. నరేంద్ర లాంటి నాయకులతో ధర్మపురి వెంకట్రాం పని చేశారని ఆయన తెలిపారు.
previous post