28.7 C
Hyderabad
April 27, 2024 04: 34 AM
Slider ఖమ్మం

వివాదాలు వద్దు-రాజీలు ముద్దు

#jlpd

సమాజంలో మంచి, చెడులు సహజంగానే ఉంటాయి. కావాలని వివాదాలకు ఎవరు పోరు.. కొన్ని సమయాల్లో అనుకోకుండానే సన్నిహితంగా మెలిగే వారి మధ్య కూడా వివాదాలు వస్తుంటాయి. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి, మంచి మనసులతో పరిష్కరించుకుంటే వివాదాలు సమసిపోతాయి. ఈ ఆలోచనలు వ్యక్తిగతంగా మంచి వాతావరణం, మంచి సమాజానికి దోహదపడతాయి.. ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరూ గమనించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పోటు గణేష్ లు కోరారు. వివాదాలు వద్దు.. రాజీమార్గం ముద్దు, మీరే తేల్చుకోండి అంటూ కేసుల సత్వర పరిష్కారం కోసం ఉచిత న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం కోర్టులో జరగనున్న “మెగా లోక్ అదాలత్” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీపై కానీ, మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని రాజీ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయబడుతుందని తెలిపారు. యాక్సిడెంట్ కేసులు, కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడదగు మొదలగు కేసులను మెగా లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం ఫిర్యాదు దారుడు, నేరస్తుడు ఇద్దరు తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని కొత్తగూడెం కోర్ట్ కు రావాల్సి ఉందని  తెలిపారు.

Related posts

మతి భ్రమించి మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సమస్యల పరిష్కారం దిశగా పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment