33.7 C
Hyderabad
April 29, 2024 02: 44 AM
Slider ముఖ్యంశాలు

కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడే ఏపీలో పీపీఈ కిట్లు లేవు

#BopparajuVenkateswarlu

కరోనా మహమ్మారి ముమ్మరంగా ఉన్నపుడే ఆంధ్రప్రదేశ్ లో  పీపీఈ కిట్లు లేవని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జెఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే నాలుగు లక్షల పీపీఈ కిట్లు ఎలా తెస్తారు? అని ఆయన ప్రశ్నించారు.

ఏపీ జెఏసీ అమరావతి పక్షాన గవర్నర్ గారిని కలిసామని, పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను 7 పేజీల లేఖలో సమర్పించామని ఆయన తెలిపారు.

లక్ష నలభైవేల పోలీస్ స్టేషన్లు పరిశీలించాలి, బ్యాలెట్ బాక్సులు, సరంజామా మొత్తం తీసుకోవాలి ఎన్నికల ప్రక్రియ ఒక్క రోజులో అయ్యేది కాదు ప్రజలకు ఎన్నికల అవేర్నెస్ ఎంత ఇచ్చినా భయాందోళనలలో ఉన్నారని ఆయన తెలిపారు.

 తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికలు జరిపితే ముప్ఫై శాతం ఓటింగ్ దాటలేదని ఆయన అన్నారు.

పంచాయితీ ఎన్నికలంటే వందశాతం పోలింగ్ ఆశిస్తారని, రెండు మూడు లక్షల సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే కుదరదని అన్నప్పుడు ఎస్ఈసీ పంచాయితీ ఎన్నికలు ఎందుకు పంతం పడుతున్నారో చెప్పాలని ఆయన తెలిపారు.

Related posts

16 నెలలు జైల్లో ఉండే దొంగ రాష్ట్ర సీఎం.. ఇదీ మన ఖర్మ

Satyam NEWS

మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన

Satyam NEWS

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో జీవిత ఖైదు

Satyam NEWS

Leave a Comment