Slider కడప

రాజంపేట క్వారంటైన్ కు కువైట్ ఎన్నారై లు

#Rajampet quarantine

కడప జిల్లా లోని 25 మండలాలకు చెందిన 112 మంది 5 బస్సులో శుక్రవారం రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కు చేరుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ అక్కడ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి ప్రవాసాంధ్రులు రాజంపేట కు చేరుకున్నారు. డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి వీరికి స్వాగతం పలికారు.

వీరికి అన్నీ వసతులు కల్పించామని వీరందరినీ 14 రోజుల పాటు ఉంచి, అనంతరం వారిని వారి ఇండ్లకు పంపి అక్కడ హోమ్ క్వారంటైన్ లో పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. రూముకు ఇద్దరు చొప్పున పెట్టామని తెలిపారు. వీరందరి స్క్రీన్ టెస్ట్ లు చేస్తామని, వీరిని బంధువులు కలిసేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఇక్కడ వద్దనుకున్న వారికి రాజంపేటలో ప్రవేటు హోటళ్లలో క్వారంటైన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

కువైట్ లో కరోనా సోకిన వారిలో 50 శాతం మంది ఇండియా వారే ఉన్నారని, వారిని కువైట్ వారు దగ్గరికి కూడా రానియ్యడం లేదని, వారి పరిస్థితి దుర్భరంగా ఉందని ఇక్కడికి చేరుకున్న బాధితులు తెలిపారు. తమతో పాటు ఇంకా అనేక మంది అక్కడే ఉన్నారని,వారందరినీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రప్పించేందుకు కృషి చేయాలని వారు కోరారు.

Related posts

ఏపి బీజేపీ ఖాళీ: వరుస పెట్టి బయటకు వెళ్తున్న నేతలు

Satyam NEWS

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

Satyam NEWS

నెలాఖరున సమ్మెలోకి బ్యాంకు ఉద్యోగులు

Satyam NEWS

Leave a Comment