27.7 C
Hyderabad
April 26, 2024 05: 50 AM
Slider నల్గొండ

భూ వివాదంలో అధికార పార్టీ కక్ష సాధింపు

#Open Land

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో మాధవరాయని గూడెంలో ఓ వ్యవసాయ బావి భూమి గ్రామ కంఠంలో ఉంది. ఈ భూమిలో దాదాపు మూడు తరాల నుండి ఒక కుటుంబం ఉంటున్నది. అధికార పార్టీకి చెందిన కొందరు ఈ బావి మున్సిపాల్టీకి చెందిందని, దీన్ని మున్సిపాల్టీ వారు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఈ భూమి తర తరాల నుండి తమ ఆధీనంలో ఉందని, కావాలని కొందరు తమ పై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని ఆ భూమిలో నివాసం ఉంటున్న మోదాల సైదులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తమ గ్రామంలో కొందరు ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అన్ని లేఅవుట్ల జాతకాలు తేల్చండి

హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో అనేక లే అవుట్ ప్లాట్లు ఉన్నాయని, వాటికి ఫెన్సింగ్  ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్, మున్సిపాల్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ ఆరోపించారు.

హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో లే అవుట్ల స్థలాలను కొందరు ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టారని, వాటిని అన్నింటినీ మున్సిపాల్టీ అధికారులు, పాలకులు కూల్చి వేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని, ప్రభుత్వం ఆస్తులను కాపాడాలని వారు అన్నారు.

అధికారులా పార్టీకి సేవకులా

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాల్టీ లే అవుట్ల స్థలాలు ఆక్రమణకు గురి అయిన వాటి పై పోరాటం చేస్తామని అన్నారు. అధికారులు తక్షణమే లే అవుట్ స్థలాలు ఆక్రమించి కట్టడాలు చేసిన వాటిని కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

కొందరు అధికారులు అధికార పార్టీ కి సేవకులుగా మారారని, వారు అటువంటి దానిని విడవాలని సూచించారు. అధికారాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారలు మాత్రం ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పని చేయాలని వారు సూచించారు.

Related posts

ట్రాజిక్ ఎండ్: మేం ఈ లోకంలో బతకలేం వెళ్లిపోతున్నాం

Satyam NEWS

చిరువ్యాపారులకు అండగా నిలిచిన సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

ఈ స్కూల్ ను కాపాడకపోతే ప్రభుత్వమే వేస్టు

Satyam NEWS

Leave a Comment