42.2 C
Hyderabad
April 26, 2024 15: 13 PM
Slider జాతీయం

ఓఎన్‌జీసీలో తొలి మహిళా చీఫ్‌..

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) సంస్థ తాత్కాలిక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అల్కా మిట్టల్‌ను ప్రభుత్వం నియమించింది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తిదారుకు తొలి మహిళా అధినేత్రిగా ఆమె నిలిచారు. డిసెంబరు 31న పదవీ విరమణ చేసిన సుభాష్ కుమార్ స్థానంలో మిట్టల్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్‌తోపాటు కామర్స్‌లో డాక్టరల్ పట్టా పొందిన అల్కా మిట్టల్ నవంబర్ 27, 2018న ONGC బోర్డులో చేరిన మొదటి మహిళగా నిలిచారు. 59 ఏళ్ల మిట్టల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీకి సారథ్యం వహించిన మొదటి మహిళ. జనవరి 1, 2022 నుంచి అమలులోకి వచ్చే ఆరు నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు అల్కా మిట్టల్ ONGC తాత్కాలిక ఛైర్మన్‌గా ఉంటారని డీఓపీటీ ఆర్డర్ తెలిపింది.

గతంలో నిషి వాసుదేవ్ చమురు కంపెనీకి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళగా నిలిచింది. ఆమె 2014లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పగ్గాలు చేపట్టింది.కంపెనీ డైరెక్టర్ (HR లేదా హ్యూమన్ రిసోర్సెస్) అల్కా మిట్టల్‌కు ONGC చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో కంపెనీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు” అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

Related posts

33 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

Sub Editor

కెమికల్ డిజాస్టర్స్ పై దృష్టి

Satyam NEWS

స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు

Murali Krishna

Leave a Comment