37.2 C
Hyderabad
May 2, 2024 14: 56 PM
Slider విశాఖపట్నం

ఉత్తరాంధ్ర వాణి ని వినిపిద్దాం…రండి: వైఎస్సార్సీపీ

#ysrcp

వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి …వికేంద్రీకరణ ద్వారానే సాధ్యపడుతుందని విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. డిప్యూటీ స్పీకర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వికేంద్రీకరణ కు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలంతా కలిసి రావాలన్నారు. ఎన్నో ఏళ్ల కలను జగన్ ప్రభుత్వం మూడు రాజధానులతో సాధ్యం చేయనున్నారన్నారు.

వికేంద్రీకరణ తో..విశాఖ లో పరిపాలన రాజధాని వస్తే… ఉత్తరాంధ్ర లో ఉన్న మూడు జిల్లా లు అభివృద్ధి పధంలో నడుస్తాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జేడ్పీ చైర్మన్ అన్నారు. అధికార వికేంద్రీకరణ  ద్వారా నే పాలన దిగువ స్థాయి కి వెళుతుందన్నారు. ఎన్నికల కు ముందు జగన్ ఇచ్చిన వాగ్ధానం… వికేంద్రీకరణ… అని విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తే…ఉత్తరాంధ్ర లో వెనకబాటు తనాన్ని రూపుమాపొచ్చని…ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.

అధికారం చేపట్టిన వెంటనే వికేంద్రీకరణ పచ దృష్టి పెట్టారని…కానీ అమరావతి రైతులు ఆందోళన…ప్రతిపక్ష పార్టీ కి మద్దతు గా పాదయాత్ర చేపట్టడం.. వాళ్ళ ఇష్ఠమని అన్నారు. కానీ ఉత్తరాంధ్ర లో పుట్టి పెరిగి ..ఈ ప్రాంతం వెనకబాటుతనం పారద్రోలాలంటే వికేంద్రీకరణ ఒక్కటే పరిష్కారమని అన్నారు.. జేడ్పీ చైర్మన్. ఆ ఉద్దేశ్యం తోనే జిల్లా నుంచీ 15 వేల మంది. జేఏసీ పిలుపు మేరకు.. విశాఖ లోని ఈ నెల 15న జరగబోవు ఆందోళన ను పయనమవుతున్నామన్నారు….వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ,జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు.

Related posts

పేట మార్కెట్ యార్డు చైర్మన్ గా అబ్దుల్ హనీఫ్

Satyam NEWS

ఇష్టంలేని పెళ్లి చేశారని ప్రేమికుల ఆత్మహత్య

Bhavani

ఆత్మస్థైర్యంతో పని చేయండి…అధికారం మళ్ళీ మనదే

Bhavani

Leave a Comment