32.7 C
Hyderabad
April 27, 2024 01: 02 AM
Slider ప్రపంచం

బంగ్లాదేశ్‌ లో ఉల్లిపాయల ధర ఎంతో తెలుసా?

onion

మన దేశంలో దిగుబడి లేక ఉల్లి పాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో బంగ్లా దేశ్ కు భారత్ ఎగుమతులు నిలిపివేసింది. భారత్‌ నుంచి ఉల్లి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220 కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్‌, చైనా ల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన నివాసంలో ఉల్లి వాడొద్దని బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ లోని పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ.70 కి చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి వచ్చింది.

Related posts

విజయనగరం ఖాకీలలో పెల్లుబుకుతున్న సేవా దృక్పథం…!

Satyam NEWS

టెన్త్ క్లాస్: తెలంగాణ బాటలో నడిచిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS

ప్రజల కొంపలు ముంచుతున్న కాలువల కబ్జా

Satyam NEWS

Leave a Comment