42.2 C
Hyderabad
April 26, 2024 18: 06 PM
Slider ఆదిలాబాద్

దొరవారి తిమ్మాపురం ప్రజలకు అండగా ఉస్మానియా విద్యార్థులు

#ou

ప్రభుత్వం,అధికారులు కలిసి ఆడుతున్న నాటకంలో ఆదివాసీ ప్రజలు బలి అవుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ ఆదివాసి విద్యార్థులు ఎ ఎస్ ఎఫ్ ఆరోపించారు. కట్టెల కోసం అడవికి వెళ్ళిన కోవా లింగోబారావుపై దాడి చేసిన సంఘటన మరువకముందే మంగళవారం తాడ్వాయి మండలంలో ఆదివాసుల ఆరాధ్య దైవం సారలమ్మ గద్దెను కూల్చివేశారని,బుదవారం  దొరవారి తిమ్మాపూర్ ఊరు కాళీ చేయాలని ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల హుకుం చేశారని ఆరోపించారు. చూస్తూ ఊరుకుంటే ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాన్ని ఆక్రమించిన ఆశ్చర్యపోనవసరం లేదని హేళన చేశారు. ఆదివాసులపై నిత్య కృత్యంగా సాగుతున్న దాడులను,వారికి జరుగుతున్న అవమానాలకు వ్యతిరేకంగా ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో బుదవారం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం నాయకులు సాగబోయిన పాపారావు, కుంజ లక్ష్మీనారాయణ,అరెం అరుణ్,మడావి అజయ్, బొచ్చు నరేష్,సువర్ణపాక రామాంజనేయులు,చంటి, సప్కా శివ శంకర్,దుర్వా హరిదాస్,శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.

Related posts

తెలిసి తప్పు చేస్తే.. ఊరుకునేది లేదు

Satyam NEWS

కరోనా వైరస్ కు విస్కీ మందు (ట)

Satyam NEWS

పువ్వాడను కలిసిన బార్ కమిటి.

Murali Krishna

Leave a Comment