38.2 C
Hyderabad
April 29, 2024 14: 38 PM
Slider ఖమ్మం

మన ఊరు-మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలి

#kmmdc

ఖమ్మం జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 426 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద అభివృద్ధి పనులు చేపట్టినట్లు, 416 పాఠశాలల్లో పనులు గ్రౌండింగ్ అయినట్లు తెలిపారు. ఇందులో 372 పాఠశాలల్లో ఉపాధిహామీ క్రింద పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గుర్తించిన 63 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు చేపట్టినట్లు ఆయన అన్నారు. పెయింటింగ్ కు సిద్ధంగా ఉన్న పాఠశాలల్లో పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇంకనూ 10 పాఠశాలల్లో పనులు ప్రారంభం కానట్లు, వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పూర్తి అయిన పనులకు వెంట వెంటనే ఎంబి లు సమర్పించాలన్నారు.

నవంబర్ 15 కల్లా పూర్తయిన పనుల బిల్లులు సమర్పించాలన్నారు. పనులు పూర్తయిన పాఠశాలలకు ఈ నెల నుండి డ్యూయల్ డెస్క్ ల పంపిణీ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. 12 పాఠశాలల్లో 27 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రివైజ్డ్ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గిరిజన సంక్షేమం, రోడ్లు భవనాల ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల పూర్తికి అధికారులు రోజువారీ సమీక్ష చేయాలని, వ్యక్తిగత శ్రద్ధ తో త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య, ఇఇలు నాగశేషు, శ్యామ్ ప్రసాద్, శ్రీనివాసరావు, చంద్రమౌళి, కృష్ణ లాల్, మండల విద్యాధికారులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, డిఇ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

Bhavani

రోగనిరోధక శక్తిని చంపేస్తున్న ఆర్ఎంపి డాక్టర్లు

Satyam NEWS

నేర చరిత్ర ఉన్న వారికి టికెట్లు ఇవ్వొద్దు

Bhavani

Leave a Comment