32.7 C
Hyderabad
April 27, 2024 02: 22 AM
Slider సినిమా

క్లాప్ ఎగైన్: కళ్యాణ్ కు కలసిరాని రీమేక్ లు

pawan 02

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయ రంగానికి వెళ్లిపోయారు. అజ్ఞాతవాసి చిత్ర పరిశ్రమ భాషలో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ విరామం తర్వాత రాజకీయాలలో బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య తన పార్టీకి నిధులు కావాలని ఏకంగా 3 సినిమాలు ఒప్పుకున్న విషయం విదితమే.

చాలా గ్యాప్ తర్వాత 26వ చిత్రంగా రాబోయే ఈ సినిమా పై చిత్ర యూనిట్ అంచనాలు పెంచేసింది. ఇంది హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ అని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. గత ఏడాది విడుదలైన పింక్ చిత్రం అమితాబ్ పరాకాష్ఠ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సమాజంలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం, చట్టంలో లొసుగులు వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

ఇక వృద్ధుని గెటప్ లో అమితాబ్ నటన సహజత్వంతో ఉంటుంది. పవన్ గతంలో ఇలాంటి పాత్ర చేసి ఉండలేదు. పైగా అమితాబ్ తో పోలిక తప్పకుండా ఉంటుంది. మరి తెలుగులో పవన్ తన మేనరిజమ్స్ తో ఎలా మెప్పిస్తాడా అని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు.

పైగా పవన్ నటించిన రీ మేక్ లలో ఒక్క గబ్బర్ సింగ్ చిత్రం తప్ప మిగిలిన రీ మేకులన్నీ మిస్ ఫైర్ అయ్యాయి. మళ్లీ కోట్లు ఖర్చు పెట్టే బదులు ఫ్రెష్ స్టోరీ అయితే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి గాను 30 రోజుల షెడ్యుల్ కు 30 కోట్లు. ఏపీ నుంచి తెలంగాణ కు డైలీ హెలికాప్టర్ ఖర్చులు అన్నీ నిర్మాత దిల్ రాజు ఇచ్చేందుకు ఒప్పందం అయిందని సమాచారం.

Related posts

పి‌ఎస్‌ఆర్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆటల పోటీలు

Murali Krishna

క్రీడలు ప్రోత్సహించే విధంగా సారధి చిత్రం

Bhavani

సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: ఈటల రాజేందర్

Satyam NEWS

Leave a Comment