28.7 C
Hyderabad
April 27, 2024 03: 52 AM
Slider విజయనగరం

మాన్సాస్ సమస్య‌: పెండింగ్ జీతాలకై ఉద్యోగస్థుల ఆందోళన‌…!

#vijayanagaram kota

విద్య‌ల న‌గ‌ర‌మైన విజ‌య‌న‌గ‌రంలో కోట‌లో కొలువై ఉన్న మ‌హారాజ అల‌క్ నారాయ‌ణ  ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) లో హైడ్రామా నెలకొంది. అదీ ఆనంద‌గ‌జ‌ప‌తి రాజు జ‌న్మ‌దినోత్స‌వం రోజు మాన్సాస్ ఉద్యోగుల త‌మ‌కు 16 నెల‌లుగా జీతాలు ఇవ్వ‌టం లేదంటూ కార్యాల‌యం ముందే ధ‌ర్నాకు దిగారు  దీంతో ప్ర‌తిష్లాత్మ‌క‌మైన రాజు గారి కోట‌లో ఈఓ డౌన్,డౌన్ అంటూ నినాదాల‌తో  ప్రాంగ‌ణం హోరెత్తింది. అదే స‌మ‌యంలోనే ఎస్పీ దీపికా పాటిల్..కొత్త పేట నీళ్ల ట్యాంక్ వ‌ద్ద నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేష‌న్ భ‌వనాన్ని ప‌రిశీలించేందుకు వెళ్లారు. స‌మాచారం తెలుసుకున్న ఆమె..డీఎస్పీని కోట వ‌ద్ద‌కు వెళ్లాలంటూ అక్క‌డ నుంచీ తిరిగి వెళ్లిపోయారు. ఇక కోట లోని మాన్సాస్ కార్యాల‌యం వ‌ద్ద డీఎస్ప సూచ‌న‌ల‌తో టూటౌన్ సీఐ ముర‌ళీ, ఎస్ఐలు కృష్ణ ప్రసాద్ ,శోభ‌న్ బాబు,నారాయ‌ణ‌లు వ‌చ్చి ఉద్యోగ‌స్తుల‌ను ధ‌ర్నా విర‌మించ‌మ‌ని కోరారు.అప్ప‌టికే మాన్సాస్ ఈఓ జీతాల స‌మ‌స్య‌ల‌ను మంగ‌ళ వారం నాడు ప‌రిస్కరిస్తాన‌ని హామీ ఇచ్చారు. అంత‌టితో ఆగ‌ని మాన్సాస్ ఉద్యోగ‌స్తులు స‌రాస‌రి చైర్మ‌న్ అశోక్ బంగ్లాకు చేరుకుని ఆయ‌న‌తో చ‌ర్చించారు.  ఏదైనా మ‌ధ్యాహ్నం నుంచీ సాయంత్రం వ‌ర‌కు  కోట నుంచీ  బంగ్లా వ‌ర‌కు  అటు మీడియా, ఇటు పోలీసులు ప‌రుగులు పెట్టాల్సి  వ‌చ్చింది.

Related posts

కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసల వెల్లువ

Satyam NEWS

శ్రీశైలం మహాక్షేత్రంలో డ్రోన్ కెమెరాల కలకలం

Satyam NEWS

మేడారం జాతరకు సకల ఏర్పాటు పూర్తి

Satyam NEWS

Leave a Comment