28.7 C
Hyderabad
April 26, 2024 10: 25 AM
Slider హైదరాబాద్

నత్తనడక డ్రైనేజీ పనులతో మార్కెట్ దారులకు తీవ్ర ఇబ్బంది

#drainage works

అంబర్పేట్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా నల్లకుంట డివిజన్ లోని నల్లకుంట కూరగాయల మార్కెట్ నుంచి శివం రోడ్డు వరకు డ్రైనేజ్ నాలా పనులు మొదలుపెట్టి  మూడు నెలలు కావస్తోంది, కానీ పనులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు చేయడం వల్ల స్థానిక మార్కెట్ ప్రజలు, దుకాణదారులు తమ జీవనోపాధి పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారని స్వామి వివేకానంద యువసేన అధ్యక్షుడు శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు నాల పనులను త్వరగా పూర్తి చేయాలని “రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు” అక్కడ మార్కెట్లో పండ్లు, కూరగాయలు, పూలు,  అమ్ముకొని బతికే పేద జీవితాలతో చెలగాటం ఆడవద్దని, రోడ్డుకు ఆనుకుని వ్యాపారం చేసే వ్యాపారస్తులు దుకాణదారులు చాలా నష్టపోతున్నారని తెలిపారు.

నాలా పనుల ఆలస్యం కారణంగా కొనుక్కునేవారు లేక వ్యాపారం సరిగా జరగడం లేదని, త్వరగా నాల పనులు పూర్తిచేసి నాసిరకం ఇసుక సిమెంటు, కంకర, స్టీలు, వాడకుండా భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా నాలా నిర్మాణం చేయాలని జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్ ,ప్రభుత్వానికి కోరారు. లేనిపక్షంలో దీనిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

Related posts

విద్య‌ల న‌గ‌రంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ అదృశ్యం….!

Satyam NEWS

ప్రచారానికి ప్రకటనల లెక్కలు

Murali Krishna

సంచైత నియామకం చట్టరీత్యా వ్యతిరేకం

Sub Editor

Leave a Comment