కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఆదివారం జనతా కర్ఫ్యూ విధించగా ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ లో పాల్గొని విజయవంతం చేసిన సంగతి విదితమే. రోజు రోజుకి కి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్నoదున రాష్ట్ర ప్రభుత్వం 23వ తేదీ నుండి ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించింది.
అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు ఇంటి వద్ద నుండి బయటకు రావద్దని, వచ్చిన ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావాలని సూచించింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కిరాణా షాపులు, పాల షాపులు, కూరగాయల శాఖలకు మినహాయింపు ఇచ్చారు.
అవి కూడా ఏడు గంటల తర్వాత అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. గ్రామాల్లో ప్రజలు ఇళ్ల కే పరిమితం కావాలని, సడక్ బంద్ పాటిస్తూ గ్రామ పొలిమేర దాటకుండా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఇది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తరిగొప్పుల పోలీసు ఇన్స్పెక్టర్ డి.హరిత చౌదరి కోరారు.
లాక్ డౌన్ ను ప్రజలు లైట్ తీసుకోకుండా ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని, ఎవరైనా పెట్రోలింగ్ పార్టీ పోలీసులకు ద్విచక్ర వాహనాలు, వాహనాలపై ప్రయాణిస్తూ కనిపించిస్తే వాహనాలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలంతా నిర్లక్ష్యం వీడి కరోనా వైరస్ నిర్మాణాలకు పాటుపడాలని, లాక్ డౌన్ లో ప్రజలు పోలీసులకు, వైద్య సిబ్బందికి పూర్తిగా సహకరించాలని సూచించారు.