కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ముషారఫ్ అలీ పిలుపునిచ్చారు. ప్రజలు సమూహంగా ఎక్కడ గుమ్మిగుడవద్దని , కరోనా వైరస్ దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ కంట్రోల్ అయ్యే వరకు ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అన్నారు. అన్ని జాగ్రత్తలు పాటించి కరోనా ను తరిమి కొట్టాలి అని సూచించారు.
ప్రభుత్వం కూడా కరోనా వ్యాధి కట్టడికి అన్నీ ప్రయత్నాలు చేస్తోందని, ఎవరికైనా కరోనా ఉందని అనుమానం వస్తే వారికి వెంటనే తగిన చికిత్స అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది అంతేకాకుండా విదేశాలనుండి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశమని కలెక్టర్ వివరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకూడదని సూచించారు.