29.7 C
Hyderabad
April 29, 2024 09: 14 AM
Slider ప్రత్యేకం

ఏపిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం

#plastic rice

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం వచ్చింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద పంపిణీ చేసిన బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం కలిసి వారికి పంపిణీ చేశారు. వంట వండే సమయంలో కొందరు తెలివి కలిగిన మహిళలు వీటిని గమనించి ఏంటి బియ్యం తేడాగా ఉన్నాయి? అని పరిశీలించగా వారు కూడా భయపడే నిజాలు బయటకు వచ్చాయి.

గతంలో సోషల్ మీడియాలో వచ్చినట్లుగా ఇవి ప్లాస్టిక్ బియ్యంలాగా ఉన్నాయి. అని ఇవి తినడం వలన కడుపులో పిల్లలకు జీర్ణం కాక చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఇది ఎంతో ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.  గురువారం పాత నందాయపాలెం సాయంత్రం  విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించగా, గురువారం రాత్రికి పెరలి మహిళలు వీటిని గుర్తించి ఎంతో ఆందోళన చెందారు. దీనిపై వెంటనే విచారణ జరిపించి బియ్యం సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

విచారణకు ఆదేశించాం: డిప్యూటీ స్పీకర్ కోన

మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అనే కలకలం పై ఇప్పటికే విద్యా శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వెంటనే విచారణకు ఆదేశించామని, దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఇంటికి  వెళ్లి విచారణ చేస్తారని అనంతరం సరఫరా చేసిన కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

Related posts

హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రవాణా మంత్రి

Sub Editor 2

మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే రోజా పదవులకు పనికిరారు

Satyam NEWS

భయంతో ఎమ్మెల్యేలు

Murali Krishna

Leave a Comment