28.7 C
Hyderabad
April 28, 2024 05: 27 AM
Slider ఖమ్మం

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు

#khammamcollector

పోడు భూముల పట్టాల జారీకి చర్యలు వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, ఎంపిడివో లు, ఎఫ్ఆర్వో లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోడు భూముల పట్టాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోడు భూముల పట్టాల విషయమై ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తుల క్షేత్ర పరిశీలనచేసి, సర్వే ప్రక్రియ పూర్తి చేసినందుకు కలెక్టర్ అధికారులను అభినందించారు.

పట్టాల పై ఇంటిపేరు, పేర్లలో ఒత్తులు, పొల్లులు, అచ్చు తప్పులు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అన్నారు. సింగరేణి, సత్తుపల్లి, కొణిజేర్ల, కామేపల్లి, పెనుబల్లి, రఘునాథపాలెం మండలాల్లో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాల జారీ చేయనున్నట్లు ఆయన అన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగన్వాడీ సిబ్బంది సమస్యలను సంస్కరించండి

Satyam NEWS

ఎమ్మెల్యే గంటా రాజీనామా వెనుక వ్యూహం ఏమిటి?

Satyam NEWS

యువత మేలుకో..

Satyam NEWS

Leave a Comment