37.2 C
Hyderabad
April 26, 2024 20: 04 PM
Slider గుంటూరు

నవతరంపార్టీ ఏపి నూతన అధ్యక్షురాలుగా పోకూరి కవిత

#navataramparty

నవతరంపార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షురాలుగా పార్టీ సీనియర్ నాయకురాలు పోకూరి కవిత ఎన్నికయ్యారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం జరిగిన నవతరంపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రావుసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కేంద్రం పై పోరాడటంలో రాష్ట్రంలో ప్రధానరాజకీయ పార్టీలు విఫలం కావడంతో కొత్త ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నారు.

తెలుగుదేశం, వైస్సార్ కాంగ్రెస్ నేతలు జగన్మోహన్ రెడ్డి,చంద్రబాబు కేసుల భయంతో కేంద్రంలో బీజేపీ పై మెతక వైఖరిని అవలంభిస్తున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారు అని ఇక రాష్ట్ర సమస్యలపై పోరాడే పరిస్థితిలో ఆపార్టీలు లేవని తెలిసిపోయింది అన్నారు. నవతరంపార్టీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పుల్లా రవి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కుదర కుమారి ఎన్నికయ్యారని తెలిపారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ రజాక్ ను నియమించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనడం కోసం నవతరంపార్టీ నుండి టుమెన్ కమిటీ ని ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు గా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షులు యనమండ్ర కృష్ణ కిషోర్ శర్మ,గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్లాల సాయి సుబ్రహ్మణ్యం రాజు ని నియమించారు.2024 రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 175 అసెంబ్లీ,25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానం చేశారు. ఈసందర్భంగా నూతన కమిటీ బాద్యులను రావుసుబ్రహ్మణ్యం అభినందించారు.

Related posts

Danger level: వరద భయంతో…..గుట్టలపై గుడారాలు

Satyam NEWS

పాకిస్తాన్ వాడే మాటల్నే మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్‌

Satyam NEWS

Leave a Comment