26.7 C
Hyderabad
April 27, 2024 07: 57 AM
Slider విజయనగరం

ఏఓబీలో ఓఎస్డీ వ్యూహంతో పోలీసుల‌ ప్లాన్ స‌క్స‌స్…!

#AOB police

స‌రిగ్గా జులై 3న ఏపీ రాష్ట్రంలోని అదీ ఆంద్రా,ఓడిషా స‌రిహ‌ద్దు(ఏఓబీ)  ప్రాంతం. విజ‌య‌న‌గ‌రం జిల్లా మ‌క్కువ మండ‌లం.. ఎగువ మండంకి తాడిపుట్టి గ్రామాలు.ఈ రెండు  ఊర్లు అస్స‌లు ఉన్నాయ‌ని…అక్క‌డి వాళ్లకు త‌ప్ప…త‌క్కిన ప్ర‌జానీకానికి తెలియ‌దంట న‌మ్మ‌క త‌ప్ప‌దు.

ప‌క్కా వ్యూహంతో  అదీ ఓఎస్డీ సూర్య‌చంద్ర‌రాజు ప‌ర్య‌వేక్ష‌ణలో ఎస్పీ రాజ‌కుమారీ సంక‌ల్పంతో ఆ రెండు గిరిజ‌న ప్ర‌జ‌ల‌ను అక్కున చే్ర్చుకోవాల‌నుకున్నారు.

అనుకున్న‌తడ‌వు….త‌న ఆలోచ‌న‌ను, ఓఎస్డీకి చెప్ప‌డం…త‌న‌పై అధికారి ఆదేశాల‌ను పాటించ‌డం రెండు చ‌క‌చ‌కా జ‌ర‌గ‌డం..ఫ‌లితం……దాదాపు 300మందితో స్పెష‌ల్ పార్టీ కూంబింగ్ తో అడుగ‌డుగునా భ‌ద్ర‌తా ద‌ళాల బందోబ‌స్తు మ‌ద్య మావోయిస్టు సంచ‌రించే  ఏఓబీలో అదీ మీడియాను వెంట పెట్టుకుని మరీ అడుగు పెట్టి…అక్క‌డ వారి తెగ భాష జాతా లో మాట్లాడ‌ట‌మేకాకుండా అక్క‌డే ఉంటూ వాళ్ల‌తో  క‌లిసి భోజనం  చేసిన ఘ‌న‌త విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీకే చెందుతుంది.

ఏఓబీలో అందున మ‌క్కువ ప్రాంతం మావోయిస్టుల స్థావరమ‌ని పోలీసులు రికార్డులే స్ప‌ష్టం చేస్తున్నాయి. వారాంత‌పు సంత‌ల‌లో  త‌ర‌చూ గిరిజ‌నుల‌తో మ‌మేక‌మై వ‌స్తూ పోతు ఉంటారు…మావోయిస్టులు.ఈ ర‌క‌మైన స‌మాచారం  స్పెష‌ల్ బ్రాంచ్ ఇంట‌లిజెన్స్ వ‌ద్ద ఎప్ప‌టిక‌ప్పుడు ఉంటుంది కూడ‌.

అక్క‌డకు వెళ్లాల‌న్నా…చేతిలో వెపన్ లేనిదే ఏ ఒక్క కానిస్టేబుల్ వెళ్ల‌డు. అలాంటి ఏకంగా జిల్లా ఎస్పీ అదీ ఓ లేడీ తెగించి గిరిజ‌నుల‌తోమ‌మేకం అవుతాన‌ని కొద్ది నెల‌ల క్రితమే ప‌క్కా ప్లాన్ వేసుకుని మ‌రీ జులై 3 న ఎగువ మండంకి తాడిపుట్టిల‌ను  సంద‌ర్శించారు…ఎస్పీ. 

ఎస్పీ రాజ‌కుమారీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగియ‌డం వెన‌క‌…ఆ రెండు పోలీస్ స్టేష‌న్ అధికారులు,సిబ్బంది పాత్ర ఉంద‌ని చెబుతోంది..స‌త్యం న్యూస్.నెట్. ఏజ‌న్సీ  ప్రాంతాల‌ను అందునా వారితో  క‌లిసి భోజ‌నం చేయాల‌ని ఎస్పీ రాజ‌కుమారీ చ‌ప్ప‌డం త‌డ‌వు…ఓఎస్డీ సూర్య‌చంద్ర రావు క్షణం ఆలోచించ‌కుండా అందుకు త‌గిన కార్య‌చ‌ర‌ణ‌కు రంగంలోకి దిగారు.

ఏఓబీ స‌రిహ‌ద్దు ప్రాంత పోలీస్ స్టేష‌న్ అయిన మ‌క్కువ‌,సాలూరు సిబ్బంది సీఐఅప్ప‌ల‌నాయుడు,ఎస్ఐలు రాజేష్, ఫ‌కృద్దీన్ ల‌తో చ‌ర్చించారు.వాళ్ల‌తోక‌లిసి ఎగువ మండంకి తాడిపుట్టి గ్రామాల‌కు స‌రైన దారి లేద‌ని తెలుసుకున్నారు.

మ‌రుక్ష‌ణం ఆ రెండు గ్రామాల‌లో్  క‌మ్యూనిటీ పోలీసింగ్ నుఅమ‌లు చేయాలని నిశ్చ‌యించుకున్ మరుక్ష‌ణం స్థానిక గిరిజునుల‌తో స‌మావేశం అయ్యారు. మక్కువ‌లో గిరిజనుడు మ‌ల్లుదొర‌తో క‌లిసి ఆ రెండు గ్రామాలకు ర‌హ‌దారి నిర్మించేప‌నిలో నిమ‌గ్నై మైదాన ప్రాంతానికి 900  మీట‌ర్లు రెండు కిలోమీట‌ర్ల  రోడ్డును కొండ‌పైనే  అటు గిరిజ‌నులు,ఇటు పోలీసుల శ్ర‌మ‌దానంతో వేసారు.

ఇక ఆ రెండు ఊళ్ల వారు తెలుగు మాట్లాడం రాదు,జాత అనే  భాష మాత్ర‌మే తెలుసు.అక్క‌డి ఆమ‌డ దూరం కొండ వెలుప‌ల ఓడిషా రాష్ట్రం తాలూక నారాయ‌ణ పట్నం. ఈ రెండుఊర్ల మ‌నుషులు స‌మీప రాష్ట్రంలో ఉన్న‌…ఎలాంటి సౌక‌ర్యాలు లేవ‌ని  పిల్ల‌ల‌ను పెళ్లిళ్లు చేసుకోవాడినికి ముందు రావటం లేదు.

తాజాగా జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ త‌న బృందంతో ఎగువమండ‌కి,తాడిపుట్టిలో గిరిజ‌నులు అందున మ‌హిళ‌ల‌తో మ‌మేక‌మై మేమున్నాం…మీ  భ‌ద్ర‌తే మా బాధ్య‌త అన్న‌విధంగా వాళ్ల‌తో మమేక‌మై గిరిపుత్రుల‌లో వెలుగును నింపారంటోంది…స‌త్యం న్యూస్.నెట్. హేట్సాప్..ఎస్పీ రాజ‌కుమారీ…హేట్సాప్ ఓఎస్డీ సూర్య‌చంద్ర‌రావు, మ‌రియు హేట్సాప్ గిరిజ‌న నేత  మ‌ల్లుదొర‌.

ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్.నెట్

Related posts

ఎస్‌సిఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో ద‌ర్యాప్తు త్వ‌ర‌గా పూర్తి చేయాలి

Satyam NEWS

గులాబీమయమైన అంబర్ పేట

Satyam NEWS

కులాలను రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే

Sub Editor

Leave a Comment