27.7 C
Hyderabad
April 26, 2024 06: 09 AM
Slider సినిమా

పోలీసుల ‘సంఘర్షణ’ ని తెరకెక్కిస్తున్న రియల్ పోలీస్

#policemovie

పోలీసులు అనగానే సాధారణంగా అమాయక ప్రజలను అదిలించేవారు, బెదిరించేవారు అని, సామాన్యులు ఏదైనా చిన్న తప్పు చేసి పట్టుబడితే నిర్దాక్షిణ్యంగా వారిపై కేసులు  పెట్టడం లేదా వారి దగ్గర చేయి చాచి తమ జేబులు నింపుకునేవారు అని నేటి సమాజంలో ఒక అపవాదు ఉంది. కానీ నాణానికి ఇరువైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టు అనేకమంది మంచి పోలీసులు ఉన్నారు. పోలీస్ డ్యూటీ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు అది ఒక సామాజిక బాధ్యత అని నమ్మి, తమ కుటుంబాలతో గడిపే సమయం లేకున్నా సరే సమాజ సేవలో నిమగ్నమై, తమ విధులను నిర్వర్తించే పోలీసులు ఎందరో ఉన్నారు. తమ విధుల్లో భాగంగా పోలీసులు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఒత్తిడికి గురవుతారు. కార్య నిర్వహణలో భాగంగా పోలీసులు ఎదుర్కొనే సవాళ్ళు, వాళ్లు పడుతున్న సంఘర్షణల ఆధారంగా తెలుగులో పూర్తిస్థాయిలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సంఘర్షణ.

పోలీసు అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని  సంఘర్షణ సినిమాలోని టైటిల్ సాంగ్ ను ప్రముఖ దర్శక నిర్మాత సాన యాదిరెడ్డి స్వయంగా తన చేతుల మీదుగా విడుదల చేశారు. పాట విన్న సానా యాదిరెడ్డి పోలీస్ నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఈ సినిమా చాలా భిన్నంగా ఉందని, పోలీసులు చట్టాన్ని అమలు చేయడంలో, సమాజాన్ని పరిరక్షించడంలో గ్రౌండ్ లెవెల్ లో ఎదుర్కొంటున్న సమస్యలను, సంఘర్షణలను వాస్తవాలకు దగ్గరగా చూపించారని.. ఈ సినిమా ద్వారా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరవుతారని చెప్పారు.

ఒక ఆటగాడి శ్రమ ఇంకో ఆటగాడికి తెలుస్తుంది అన్నట్లు.. ఈ సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్న అంతరఃమదన సంఘర్షణను తెరకెక్కించడానికి స్వయంగా పోలీసు ఆయన వి సిద్దార్థ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. ఫరెవర్ ఫెంటాస్టిక్ ఫిలిం బ్యానర్ పై ఎస్.కె కాజా పాషా సమర్పిస్తున్న సంఘర్షణ చిత్రానికి ఈదులకంటి చిరంజీవి గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ కుమార్, రమ్య, మధు, రవి మొదలైన వారు నూతన నటీనటులుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తుండగా.. ఆయన రాసిన సంఘర్షణ టైటిల్ సాంగ్ ఈరోజు విడుదల అయి విశేష ఆదరణ పొందుతుంది. ఈ సినిమాకి డిఓపి గా గోపి, ఎడిటర్ గా శివకాంత్, కొరియోగ్రఫీ శ్రావణ్ కుమార్ చేస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రైటర్ గా ప్రవీణ్ రాజేశ్వర్,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లుగా హరి రామకృష్ణ మరియు ప్రవీణ్ లు వ్యవహరిస్తున్నారు.

న్యాయానికి అన్యాయానికి మధ్య నలుగుతూ న్యాయాన్ని గెలిపించడంలో అన్యాయంగా ప్రాణాలను వదిలిన పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ పాట విడుదలై ప్రజాదరణ పొందుతున్నందుకు సంఘర్షణ చిత్ర యూనిట్ ఎంతో ఆనందిస్తున్నారు.

Related posts

శ్రమజీవుల హక్కులను హరించాలని చూసే కేంద్రంపై సమరం

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం శివారు ప్రాంతాల‌లో విస్త్ర‌తంగా మ‌త  ప్ర‌చారం

Satyam NEWS

కొల్లాపూర్ మునిసిపల్ కమిషనర్ పై మాజీ మంత్రి జూపల్లి ఫైర్

Satyam NEWS

Leave a Comment