32.2 C
Hyderabad
May 2, 2024 02: 59 AM
Slider ముఖ్యంశాలు

పాలకుల అనాలోచిత చర్యలతో ఐఏఎస్ లకు సమస్యలు

#IYRKrishnarao

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు చేస్తున్న చేష్టలపై సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి పదవీ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు ఘాటైన విమర్శలు చేశారు.

రాష్ట్ర రాజకీయ నాయకత్వం అనాలోచిత చర్యలతో రాష్ట్ర అధికారులకు సమస్యలను తెచ్చి పెడుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో ఎన్నికల అంశాల వరకు ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

ముఖ్య కార్యదర్శి  సాధారణ సమయంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను, క్యాబినెట్ నిర్ణయాలను అమలు చేయను అనటం ఎలాగో ఈ సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయాలను అమలు చేయకపోవటం అలాగే అవుతుందని ఐవైఆర్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల సంఘం ఉత్తర్వులలో లోపాలుంటే సంబంధిత అధికారులు కోర్టుకు వెళ్లాలి కానీ అమలు చేయను అనే అధికారం ముఖ్య కార్యదర్శికి లేదని కృష్ణారావు అన్నారు.

Related posts

పల్నాడు ప్రాంతంలో గ్రామీణ రోడ్ల అభివృద్ధికి నిధులు

Satyam NEWS

విజయనగరం సబ్ డివిజన్ : రాత్రి గస్తీ మరింత ముమ్మరం

Satyam NEWS

జిన్నాపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు

Sub Editor

Leave a Comment