40.2 C
Hyderabad
April 26, 2024 13: 49 PM
Slider తెలంగాణ

విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌లెందుకు?

ou exams

దేశంలో, రాష్ర్టంలో ఎక్క‌డైనా కానీయండి ఆయా ప్ర‌భుత్వాలు చేప‌డుతున్నప‌లు ప‌థ‌కాలు, ప‌లు ర‌కాల మార్పుల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యాల‌న్నీక‌లిసి చ‌దువుల త‌ల్లి ఒడిలో ప‌డి కాక రేపుతున్నాయి. విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటాలాడుతున్నాయ‌నే చెప్పొచ్చు. దీంతో భ‌విష్య‌త్‌పై కోటి ఆశ‌లు పెట్టుకున్న (చ‌దువుతున్నవిద్యార్థులు) వారిపై కాస్త ఈ ప్ర‌భావం ప‌డుతుంద‌నేది జ‌గ‌ద్విధిత‌మే. ఇలాంటి ఆందోళ‌న‌లు, ఆయా ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌తో ఏ ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ నేత‌లు, అధికారులు, అన‌ధికారులు కానీ చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేరా? అంటే ఎందుకు చేప‌ట్ట‌లేర‌నే స‌మాధానం వినిపిస్తుంది. కాక‌పోతే వారి ద్వారా ప్ర‌యోజ‌నం పొంది ఆయా విద్యార్థి సంఘాల‌ను, నేత‌ల‌ను, విద్యార్థుల భ‌విష్య‌త్‌తో ఆట‌లాడుకునే హ‌క్కు వారిని త‌ప్పుదోవ‌లు ప‌ట్టించే హ‌క్కు ఎవ్వ‌రికీ లేద‌నేది సుస్ప‌ష్టం. ఈ విష‌యంలో న‌వ య‌వ్వ‌నంలో ఉన్న (ఉడుకు ర‌క్తం) చ‌దువుకునే విద్యార్థులంతా కూడా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిజ‌మైన యువ‌త మేలు కోరే విజ్ఞాన వంతులు, త‌ల్లిదండ్రులు, రాజ‌కీయ నేత‌లు (నేత‌లు మాత్రం త‌క్కువ‌నే అనుకోండి!!!) కోరుతున్నారు.

రైతు బంద్ నేప‌థ్యంలో అన్నీప‌రీక్ష‌లు వాయిదా!!!

తాజాగా ఢిల్లీలో జ‌రుగుతున్న రైతు ఆందోళ‌న‌లు అంద‌రికీ తెలిసిందే. మంగ‌ళ‌వారం నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన 8న దేశ‌వ్యాప్త రైతుస‌మ్మె సెగ కాస్త (రాజ‌కీయ కార‌ణాల‌తోనే) తెలంగాణ‌ను తాకింద‌నే చెప్పాలి. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. బుధ‌వారం నుంచి జరగనున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండ‌ద‌న్నారు. మంగ‌ళ‌వారం వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ను ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని ఆయా విద్యార్థులు ఈ విష‌యాన్నిజ్ఞ‌ప్తిలో ఉంచుకోవాల‌ని ఓయూ అధికార యంత్రాంగం కోరింది. కాగా మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను 10వ తేదీన నిర్వ‌హిస్తామ‌ని జేఎన్‌టీయూ అధికార యంత్రాంగం పేర్కొన‌గా రాష్ర్టంలో జ‌ర‌గాల్సిన పాలిటెక్నిక్ డిప్లోమా స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు సాంకేతిక విద్యామండ‌లి పేర్కొంది. వాయిదా వేసిన ప‌రీక్ష‌ల‌ను ఈ నెల 23వ తేదీన నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఓయూ ప‌రిధిలో జ‌ర‌గాల్సిన రేప‌టి ప‌రీక్ష‌ల తేదీ మాత్రం ఇంకా వెల్ల‌డికాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల్లో కాస్త గంద‌ర‌గోళం, అయోమ‌యం నెలకోవ‌డం విశేషం.

Related posts

వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి దేశాన్ని రక్షించండి

Satyam NEWS

విశాఖ నగరంలో ఆసుపత్రులలో విజిలెన్స్ మెరుపు దాడులు

Satyam NEWS

బెల్లంకొండ మండలంలో అక్రమ మద్యం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment