38.2 C
Hyderabad
April 29, 2024 20: 12 PM
Slider హైదరాబాద్

విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్న బైరామల్ గూడా వాసులు

#ElectricityDepartment

ప్రజల ఇబ్బందులే తమ ఇబ్బందులుగా భావించే అధికారులు కొందరు ఉంటారు. సమస్యపై సమాచారం రాగానే స్పందిస్తారు. హైదరాబాద్ ప్రాంతంలోని బైరామల్ గూడ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు ఇదే విధంగా స్పందించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

నిన్నరాత్రి 9:30కు లింగోజిగూడా ధర్మపురి కాలనీలోని రోడ్ నెం1 రోడ్ నెం 2 మెయిన్ రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. దాంతో ఆ చెట్టు కరెంటు స్తంభం పైబడి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. స్తంభం కూలిపోవటం కరెంటు ఆగిపోవటం క్షణకాలంలో జరిగిపోయాయి.

ఈ విషయం కాలనీ ప్రెసిడెంట్ రాజు ఎలక్ట్రిసిటీ వాళ్లకు ఆ రాత్రే తెలియజేయటంతో వాళ్ళు రాత్రికి రాత్రే వచ్చి తక్షణమే పని ప్రారంభించారు. చెట్టుకొట్టటం ఆ మరునాడు యధాస్థానంలో కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడం సాహసమే.

ఈ విషయంలో బైరామల్ గూడ ఎలక్ట్రిసిటీ బోర్డు అసిస్టెంట్ ఇంజినీర్ టి. ఆర్ ప్రసాద్ విధి నిర్వహణలో తక్షణమే స్పందించి లైన్ మెన్లు తదితర కార్మికులను పంపించి 4 గంటలలో కరెంటు ఇళ్లకు తెప్పించటం కాలనీ వాసులంతా హర్షించారు.

Related posts

ఎలర్ట్: కాటేదాన్ చిరుత ఇంకా చిక్కలేదు జాగ్రత్త

Satyam NEWS

జగనన్న గోరుముద్ద రుచి చూసిన మేడా

Satyam NEWS

నిమ్మగడ్డను తొలగించడం జగన్ అధికార దాహానికి నిదర్శనం

Satyam NEWS

Leave a Comment