కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కే ఆర్ కే కాలనీ లోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్దులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక మందిని ప్రోత్సాహించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల నాయకులకు సహాయ సహకారులు అందిస్తున్నారని తెలిపారు.
ఇలాంటి వ్యక్తి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వృద్దులకు వస్త్రాలు పంపిణీ చేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో గండ్రత్ అశన్న, కిసాన్ సెల్ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొండ గంగాధర్,Ex ఎంపీటీసీ ఆరే పోచన్న,వెంకట్,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నాహిద్,ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గంగన్న, ఎస్సీ సెల్ జైనథ్ మండల అధ్యక్షుడు గంగన్న,వినోద్, మాజీ ఉప సర్పంచ్ రాజేశ్వర్,మధుకర్, కన్య ప్రభాకర్ రెడ్డి,తది తదితరులు పాల్గొన్నారు.