40.2 C
Hyderabad
April 26, 2024 12: 42 PM
Slider సంపాదకీయం

పీకే సరికొత్త వ్యూహంతో ఇద్దరికీ చిక్కులు….

#jagan

ప్రశాంత్ కిషోర్… ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితం. దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల స్ట్రాటజిస్టు. ఈయన ఎన్నికలలో పాచికలు వేశాడంటే దానికి తిరుగు ఉండదు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు ఆంధ్రాతో బాటు తెలంగాణ లో కేసీఆర్ కు కూడా వ్యూహాలు అందిస్తున్నారు. కేసీఆర్ ను మూడో సారి గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తున్నాడు. ఆంధ్రాలో అయితే జగన్ పాలన పై కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇస్తుంటాడని అంటారు.

దేశంలోని చాలా రాష్ట్రాలలో తనకు కాంట్రాక్టు ఇచ్చిన వారిని విజయతీరాలకు చేర్చడం ప్రశాంత్ కిషోర్ వ్యాపారం. ప్రశాంత్ కిషోర్ ను ఆయన టీమ్ ను కాంట్రాక్టు కు కుదుర్చుకోవాలంటే వందల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది.

గెలుపే పరమావధి కాబట్టి రాజకీయ పార్టీల వారు ఎన్ని వందల కోట్లు అయినా ఖర్చు పెట్టడానికి సిద్ధపడి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకుంటారు. ప్రశాంత్ కిషోర్ తన తెలివి తేటలతో క్షేత్ర స్థాయి పరిశీలనలో వచ్చిన ఫలితాలతో వ్యూహాలు అందిస్తుంటాడు.

అందరికి కొత్త చిక్కు

వాటిని రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటిస్తే చాలు… విజయం సొంతం అవుతుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని ప్రశాంత్ కిషోరే గెలిపించాడు. తమిళనాడులో స్టాలిన్ ను కూడా ప్రశాంత్ కిషోరే విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇప్పుడు వీరందరికి ఒక చిక్కు వచ్చి పడింది.

స్టాలిన్ కు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ జగన్, కేసీఆర్, మమతా బెనర్జీలకు ఒక ఉపద్రవం పొంచి ఉంది. అదేమిటంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరబోతున్నాడట. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ప్రశాంత్ కిషోర్ కీలక చర్చలు జరిపాడు.

చాలా కాలం కిందటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలిసి తన సేవలు అందిస్తానని, ఎన్నికలలో విజయం సాధించేందుకు వ్యూహాలు అందిస్తానని చెప్పాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో అందరూ వ్యూహకర్తలే ఉంటారని, ప్రత్యేకంగా ఎవరి వ్యూహాలూ అవసరం లేదని రాహుల్ గాంధీ చెప్పారట.

దాంతో మరుగున పడిపోయిన ఆ అంశం ప్రశాంత్ కిషోర్ వదలలేదు. మళ్లీ రాహుల్ గాంధీని కలిశాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి పని చేయమని రాహుల్ గాంధీ అప్పటిలో సలహా ఇచ్చారట. అప్పటి నుంచి ఆలోచించి…. ఆలోచించి ప్రశాంత్ కిషోర్ ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మంతనాలు జరిపాడు.

ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్, కేసీఆర్ ల పరిస్థితి ఏమౌతుంది? ఇదే పెద్ద ప్రశ్న. జగన్ కు కాంగ్రెస్ పార్టీ అంటే బద్ధ శత్రువు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఓటు బ్యాంకే జగన్ కు పెట్టుబడి. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియాగాంధీ, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీలు తనను జైలుకు పంపించారని జగన్ కు అక్కసు ఉంది.

ఇప్పుడు తన రాజకీయ వ్యూహ కర్త వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు? ఏం చేయాలి? అదే విధంగా కేసీఆర్… కేసీఆర్ కు రాష్ట్రంలో ప్రధమ శత్రువు కాంగ్రెస్ పార్టీ. తాను వ్యూహకర్తగా పెట్టుకున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏం చేయాలో కేసీఆర్ ఇప్పుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ పార్టీ తో కలిసేందుకు పెద్దగా ఇష్ట పడటం లేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ తీసుకోబోతున్న ఈ రాజకీయ నిర్ణయంపై చాలా మంది రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరీ ముఖ్యంగా జగన్, కేసీఆర్ లకు మాత్రం ప్రశాంత్ కిషోర్ తీసుకోబోయే నిర్ణయం మింగుడు పడే అవకాశం లేదు. …… లేదా కాంగ్రెస్ పార్టీతో సఖ్యత పెంచుకోవాలి….. ఏం చేస్తారో చూడాలి.  

Related posts

ఖమ్మంలో నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రత

Satyam NEWS

‘‘వై’’ దిస్ కొలవరి: స్మశానంలో పేదలకు ఇళ్ల స్థలాలు

Satyam NEWS

శాల్యూట్: పసికందు శ్వాస నిలబెట్టిన నిర్మల్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment