30.7 C
Hyderabad
April 29, 2024 04: 40 AM
Slider విశాఖపట్నం

రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ను వెంటనే ఎత్తివేయాలి

#panchaytiraj

గ్రామపంచాయతీ నిధుల వినియోగం పైన  రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ ను వెంటనే ఎత్తివేయాలని, గ్రామపంచాయతీల ఖాతాలలో ఉన్న  మొత్తం అన్ని రకాల నిధులను విద్యుత్ బిల్లులకు మాత్రమే చెల్లించాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం  విడుదల చేసిన నిరంకుశ ఉత్తర్యులను వెంటనే రద్దు చేయాలని సర్పంచ్ లు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు విశాఖ నగరంలోని బీవీకే కాలేజ్ సెంటర్ దగ్గర, పబ్లిక్ లైబ్రరీ మీటింగ్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో  రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల, గ్రామ పంచాయతీల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశత్వాన్ని ఖండించారు.

ఈ సందర్భంగా బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12918 గ్రామపంచాయతీల  సర్పంచులు ఎవ్వరు పంచాయతీల కరెంట్ బిల్లులు కట్టవద్దని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి 14, 15 వ ఆర్థిక సంఘాల ద్వారా పంచాయతీలకి పంపించిన రూ,,8660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి తన సొంత అవసరాలకు వాడివేసుకుందని అన్నారు. అదేమంటే ఆ డబ్బులు కరెంటు బకాయిల కింద జమ చేసుకున్నామని చెబుతూనే, మరలా కరెంట్ బిల్లులు కట్టమని సర్పంచ్ల పై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు.

అయినా అసలు గత ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ఉచిత విద్యుత్ని ఇచ్చారని, ఈ ప్రభుత్వం దానిని విస్మరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులు అన్నీ కూడా దారి మళ్ళీ ఇస్తుందని విమర్శించారు. అలాగే 15 వ ఆర్థిక సంఘం ద్వారా 2022 – 23 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించిన  రూ. 2,020 కోట్లు వచ్చినాయా? వస్తే ఆ నిధులు ఏమయ్యాయి?

లేదా గతంలో 8660 కోట్లు దొంగిలించి వేసినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను కూడా దొంగిలించి వేసిందా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా ఈ క్రొత్తగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ. 2,020 కోట్లు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 8660 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, అలాగే  గ్రామపంచాయతీల ఖాతాల్లో ఉన్న  అన్ని రకాల నిధులను కరెంటు బిల్లుల  క్రింద జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని రాజేంద్రప్రసాద్ అన్నారు.

రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు  లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా సర్పంచులను  పూర్తిగా నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలు లాగా మార్చి వేసిందని, నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుంటే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో పుసులూరి నరేంద్ర గౌరవాధ్యక్షులు తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ,

బిర్రు ప్రతాపరెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ , వై వినోద్ రాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్,ఆనపు రామకృష్ణ నాయుడు ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ముల్లంగి రామకృష్ణారెడ్డి గౌరవ సలహాదారులు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, బొర్రా నాగరాజు రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్త్ర కార్యదర్శి వానపల్లి ముత్యాలరావు, 

చింతకాయల సుజాత ముత్యాలు అధ్యక్షులు అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం ,గుండు శంకరరావు అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం, సోము నాయుడు విజయనగరం సర్పంచుల సంఘం నాయకులు,. చుక్క ధనుంజయ యాదవ్ చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు ,కోకా ప్రకాష్ నాయుడు సర్పంచుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి, సర్పంచుల సంఘం  మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర నాయకులు కర్రోతు సత్యనారాయణ , గేదెల రాజారావు తుంపల్లి రమణ భానో జి నాయుడు, ఎరుక నాయుడు గోవిందరెడ్డి, రౌతు శ్రీనివాసరావు చాపల మాసేను, అప్పలనాయుడుతదితరులు పాల్గొన్నారు.

Related posts

పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని ఆర్.డి.ఓ కు వినతిపత్రం

Satyam NEWS

పెరిగిన నిత్యవసర దరలను వెంటనే తగ్గించాలని డిమాండ్

Satyam NEWS

ఝాన్సీరాణి స్పూర్తితో పోరాడదాం..

Bhavani

Leave a Comment