27.7 C
Hyderabad
April 26, 2024 06: 55 AM
Slider నల్గొండ

నిత్యావసర వస్తువుల పై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది

#CITUHujurnagar

అనేక సుధీర్ఘ పోరాటాలు చేసి సాధించిన కార్మిక చుట్టాలని  8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, 29 కార్మిక చట్టాల 4 కోడులుగా మార్చిటం అన్యాయం అని, తక్షణమే కార్మిక చట్టాల సవరణ, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి  డిమాండ్ చేసినారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆల్ ఇండియా  CITU కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా CITU ఆధ్వర్యంలో రైస్ మిల్లు పారిశ్రామిక ప్రాంతంలో ప్రదర్శన నిర్వహించారు. అనఝతరం కార్మిక 4 కోడులు చట్టాలని దగ్ధం చేసిన పిదప రోషపతి మాట్లాడుతూ భారతదేశంలోని నవరత్నాల వంటి సంస్థలని అతి తక్కువగా అంబానీ, ఆదాని లకి అప్పజెప్పడం అన్యాయమని,ఇది సరైంది కాదని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నల్ల చట్టాలు తెచ్చిన తర్వాత నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా,నిత్యావసర ధరలపై నియంత్రణ లేదని,మధ్య తరగతి, సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

తక్షణమే కార్మిక 4 కోడులని రద్దు చేయాలని, 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని, బి ఎస్ ఎన్ ఎల్, ఎల్ ఐ సి, రైల్వే,విమానయాన, విశాఖ ఉక్కు తదితర సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని  కోరారు.

ఈ కార్యక్రమంలో CITU  నాయకులు గుండెబోయిన వెంకన్న, గువ్వల అంజి, ఆకం కోటేశ్వరరావు, చింతకాయల పర్వతాలు, ధనమూర్తి, సామల కోటమ్మ, మోదల గోపమ్మ, మున్ని, రాధ,సుజాత,మంగమ్మ, చంద్రకళ, పద్మ, మణి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సుఖ భోగాలకు మార్గం సౌభాగ్యాలకు ద్వారం

Satyam NEWS

డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ అరెస్టు

Satyam NEWS

కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కరోనా క్యాంప్

Satyam NEWS

Leave a Comment