40.2 C
Hyderabad
April 26, 2024 13: 55 PM
Slider హైదరాబాద్

అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలి

CPM Hyderabad

రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ కొనసాగింపు కారణంగా పేదలు, అసంఘటిత రంగ కార్మికులు పూట గడవడమే కష్టంగా ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం హైదరాబాద్ నగర కమిటి సభ్యుడు మహేందర్ అన్నారు. బతుకమ్మ కుంటలో నిరసన కార్యక్రమo నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం ప్రకటించిన బియ్యం సరఫరా కూడా రేషన్ కార్డు లేకపోవడం కారణంగా  లక్షలాది మంది పేదలకు చేరలేదని ఆయన అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో వేలాదిమంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని రేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, రేషన్ కార్డు లేని కారణంగా ప్రభుత్వం ఇచ్చే 1500 వందల రూపాయల  ఆర్థిక సహాయం రాక పోవడంతో  అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వం వెంటనే లాక్ డౌన్ సందర్బంగా పేదలకు అందించే ఆర్థిక సహాయం 3 నెలల వరకు పొడిగించాలని, అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇచ్చి వారికి రేషన్ సరుకులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోహన్ పర్వతాలు డి రాములు సుధాకర్ బీమాసేన తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్టీఆర్ తో నటించే అవకాశం జాన్వీ స్వీకరిస్తుందా?

Satyam NEWS

సీఎం జగన్ రెడ్డి తో తమ్ముడు అవినాష్ రెడ్డి భేటీ

Satyam NEWS

తొణికిన స్వప్నం

Satyam NEWS

Leave a Comment