37.2 C
Hyderabad
April 26, 2024 20: 43 PM
Slider నల్గొండ

సమాజ సేవలో ముందున్న పిఆర్ టియు ఉపాధ్యాయ సంఘం

#PRTU

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించడంతో పాటు సమాజ సేవలో కూడా ముందుంటామని శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రావ్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం రోజున విలేకరులతో మాట్లాడుతూ లాక్ డౌన్ రోజుల్లో పేద ప్రజలను ఆదుకునేందుకు పి ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. 

సంఘ సభ్యుల ఒక్క రోజు వేతనం సుమారు రూ. 18 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం వారి ఉదారత్వానికి ఉదాహరణ అని అన్నారు. కరోనా వైరస్ కాలంలో వైద్య రంగం, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని జనార్దన్ రెడ్డి కొనియాడారు.

పీ ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కాలంలో సేవలందిస్తున్న  వారిని సంఘం తరపున అభినందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కేంద్రాలలో పోలీసులను అభినందించడం, పారిశుద్ధ్య కార్మికుల కు అన్నదానం లాంటి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సగం నెల జీతం కోత పడ్డప్పటికి స్వచ్ఛంద కార్యక్రమాలలో సొంత డబ్బును వెచ్చించి పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఏ కార్యక్రమంలో సంఘము జిల్లా అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్, నాయకులు బాదం భిక్షపతి, శరత్, సత్తయ్య, విజయ్ కుమార్, నర్రా నరేందర్ రెడ్డి, వల్లాల రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Murali Krishna

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

Satyam NEWS

శివ సాయి నగర్ ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేసిన బి ఎల్ ఆర్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment