40.2 C
Hyderabad
April 29, 2024 15: 28 PM
Slider నిజామాబాద్

పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు

thnth students

PRTU బిచ్కుంద మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు విజయ స్ఫూర్తి కార్యక్రమం మంగళవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా విషయ నిపుణులు పద్మ భూషణ్ డి చంద్రకాంత్,  యం. శ్రీనివాస్, దీక్షిత్   సోమేశ్వరరావు , కె.వెంకట రావు విద్యార్థులకు అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎ.కుషాల్  మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని, నిపుణుల సూచనలు పాటించాలని తెలియజేశారు. అలాగే ప్రముఖ మానసిక నిపుణులు .జైపాల్ రెడ్డి  విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ధారణ శక్తి పెంచుకోవడం ఎలాగో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PRTU అధ్యక్షులు ఇర్షాద్ అలీ,సంఘ బాధ్యులు,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అలాగే 340 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఫారెస్ట్ ఆఫీసర్ బైక్ దగ్ధం

Bhavani

జనవరి 31నుంచి పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు

Satyam NEWS

ఈజ్ ఇట్ ట్రూ: పాకిస్తాన్ భూభాగంలో చైనా సైన్యం లేదు

Satyam NEWS

Leave a Comment