33.7 C
Hyderabad
April 27, 2024 23: 53 PM
Slider ప్రత్యేకం

కాంట్రవర్సీ: స్వామీ చెప్పవా లోకేష్ కరెక్టా సుబ్బారెడ్డా?

#Naralokesh

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు ప్రవేశం నిలిపివేసి చాలా కాలం అయింది. లాక్ డౌన్ కన్నా ముందు నుంచే భక్తులను రానివ్వడం మానేశారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలోకి కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లారు.

వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. వీటిని టాగ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుబ్బారెడ్డి దర్శనానికి వెళ్లడంపై విమర్శలు చేశారు. భక్తులను అనుమతించని వేళ సుబ్బారెడ్డి ఎలా వెళతారనేది లోకేష్ ప్రశ్న. దీనికి సుబ్బారెడ్డి లోకేష్ ను ఎగతాళి చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

శ్రీవారి భక్తుడి సూటి ప్రశ్నలు

శుక్రవారం జరిగే అభిషేకానికి చైర్మన్ హాజరు కావడం సాంప్రదాయమని, ఇది కూడా తెలియదా అంటూ ఆయన లోకేష్ ను ఎద్దేవా చేశారు. ఈ రెండింటి మధ్య నిజాలు తేల్చాల్సిన అవసరం ఉందని శ్రీవారి భక్తుడు పేరుతో తిరుపతిలో జరిగే అంశాలను రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిపే నవీన్ కుమార్ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు.

టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పై నారా లోకేష్ వ్యాఖ్యలు వాస్తవమా కాదా అనే విషయం టీటీడీ ఈవో, తిరుమల స్పెషల్ ఆఫీసర్ భక్తులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ హోదాలో వై వి సుబ్బారెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొనడంపై టీటీడీ లోని ఐఏఎస్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

మౌనం చూస్తుంటే లోకేష్ చెప్పింది నిజమా అని పిస్తున్నది

అలాగే టీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి తమ చైర్మన్ కు మద్దతుగా నారా లోకేష్ బాబు కు ఘాటుగా సమాధానం ఎందుకు చెప్పలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు. మీ మౌనం చూస్తే నారా లోకేష్ మాటలను మీరు సమర్థించినట్లు శ్రీవారి భక్తులు భావించాలా? అని ఆయన ప్రశ్నించారు.

వై వి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వెండి వాకిలి నుంచి ధ్వజస్తంభం వద్దకు వస్తూ ఉన్న వీడియో విజువల్ ఆలయం నుంచి బయటకు ఎలా వచ్చింది? ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఎలా చేరింది? ఎవరు చేర్చారు? అనేది ఇందులో కీలకమైన అంశమని ఆయన అన్నారు. ఇది ముమ్మాటికీ “ఇంటి దొంగల పనే”ఉద్దేశపూర్వకంగా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో ఎవరో అనుకూల శత్రువులు చేసిన కుట్ర అని ప్రచారం జరుగుతోందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

లాక్ డౌన్ మాలాంటి వారికే తప్ప వీఐపీ భక్తులకు కాదా?

ఇదే కాదు రెండవ సారి లాక్‌డౌన్‌ పొడగింపు సందర్భంగా కొంతమంది పాలకమండలి సభ్యులు పక్క రాష్ట్రాల నుంచి తమ అనుచరులతో వివిధ వాహనాలలో రాష్ట్ర సరిహద్దులు దాటి లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు ఎలా వచ్చారు అన్నదానిపై రాష్ట్ర డీజీపీ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

తిరుమలకు పాలకమండలి సభ్యులు ఎవరు వచ్చారు ఎంతమంది వచ్చారు అన్నదానిపై టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. వారిలో కొంతమంది ఏకాంతసేవలో మరికొంతమంది బయోమెట్రిక్ ద్వారా స్వామి దర్శనాలలో పాల్గొనడం వాస్తవమా కాదా అన్న విషయాలకు సంబంధించి ఆలయంలోని సిసి కెమెరాల ఫుటేజీలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసులు

Murali Krishna

రష్యా సైన్యంలో అంతర్ యుద్ధం మొదలు?

Satyam NEWS

మంత్రిని దూషించిన బిజెపి నేతపై ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment