38.2 C
Hyderabad
April 29, 2024 12: 43 PM
Slider పశ్చిమగోదావరి

అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయమే…

#raghurama1

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సోమవారం మరొకసారి నోటీసులు జారీ చేసిందని, ఆయనను అరెస్టు చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.  హైకోర్టు ఆర్డర్ తీర్పు కాపీ అందగానే, సుప్రీంకోర్టును వైయస్ అవినాష్ రెడ్డి  ఆశ్రయించే  అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున  సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేకపోతే వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలవాటులో పొరపాటుగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారేమోనని ఆయన ఎద్దేవా చేశారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా మాట్లాడుతూ ఇలాంటి చెత్త కేసులను  సుప్రీంకోర్టు హడావిడిగా స్వీకరించదని తెలిపారు.  సోమవారం నాడు సుప్రీంకోర్టు లో  ఒకవేళ అత్యవసర  పిటిషన్ దాఖలు చేస్తే, జగన్మోహన్ రెడ్డి కేసులను వాదించిన న్యాయవాదులే, పిటిషనర్ తరఫున వాదనలు వినిపించనున్నారు.

సుప్రీం కోర్టు త్వరగా విచారణను  పూర్తి చేయమని చెప్పిన కేసునే, విచారణ నిలుపుదల చేయమని  కోర్టుకు వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. తమ వశీకరణ విద్యలతో సమాజంలో పెద్ద, పెద్ద వ్యక్తులను లోబర్చుకునే తెలివితేటలు ఉన్న మా ప్రభుత్వ పెద్దలకు, ఒక అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి  ఢీ కొట్టడం  అభినందనీయం. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  తన వెంట్రుక కూడా ఎవరు పీకలేరని పేర్కొన్నారని, ఎంతమంది దుష్టులు ఏకమైనా రాంసింగ్ వెంట్రుక కూడా పీకలేరన్నది తన అభి మతమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఈ కేసు వ్యవహారంలో  మా పార్టీ  నాయకులు ఎవరిని కలిసినా వీక్ కావడం మినహా ఫలితం ఉండదు.  వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి దోషి అని, ఇంకెవరో దోషి అని  తాను అనడం లేదు. నిజమైన దోషి ఎవరో వైఎస్ వివేక గాయాలకు కుట్లు వేయించి, రక్తపు మరకలు తుడిపించిన వారిద్వారా నిజదోషులు ఎవరో తెలిసే అవకాశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. వైఎస్ వివేక వ్యక్తిగత మాజీ సహాయకుడు కృష్ణారెడ్డి వంటి పాత్రలను ప్రవేశపెట్టడం ద్వారా కోర్టులను గందరగోళపరచాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.

వైయస్ వివేకకు ఆయన అల్లుడికి మనస్పర్ధలు ఉన్నాయని, ఆయనే ఎందుకు చంపి ఉండకూడదని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. ఇటీవల కొన్ని ఫోటోలను కూడా  విడుదల చేయడం విడ్డూరం. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు, వివేక కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హత్యకు ముందే  వైఎస్ వివేకా కుటుంబ సమేతంగా ఆనందంగా విదేశీయాత్ర చేసి వచ్చారు. నాలుగేళ్ల అనంతరం  కేసు చేయి దాటిపోయిందని చెప్పి ఇప్పుడు రకరకాలుగా తొకడ కేసులను వేయడం సిగ్గుచేటు. ఈ కేసులను చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర విఫలమే…!

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన  విఫలమే అవుతుంది. ఒక్క సమావేశం తో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని, ప్రత్యేక హోదా కల్పిస్తే 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రధానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా  తెలిసిందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు . వైయస్ అవినాష్ రెడ్డి  అత్యవసరంగా  దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో తీర్పు  వెలువడనుండగా, మరొకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా  ముఖ్యమంత్రి హడావిడిగా హస్తినకు బయలుదేరడం  వెనుక ఆంతర్యం ఏమిటి?.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  జగన్మోహన్ రెడ్డి 60 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారని సాక్షి ఛానల్ లో  కథనాన్ని ప్రసారం చేయగా, నీలి మీడియాలో 45 నిమిషాల పాటు సమావేశమయ్యారని కథనాలను  ప్రసారం చేశారు. తాను కూడా పార్లమెంట్లోనే ఉన్నానని, కేవలం 20 నుంచి 25 నిమిషాల పాటు  ప్రధానితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సమావేశమయ్యారు. పోలవరం బిల్లులు పెండింగులో ఉన్నాయని, ప్రత్యేక హోదా కేటాయింపు ఆలస్యం జరుగుతోందని, ఇంకా మరిన్ని చిలిపి చిలిపి డిమాండ్లను   ప్రధానమంత్రి ముందు ముఖ్యమంత్రి పెట్టారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే పోలవరం బిల్లులు ఆలస్యం జరిగాయని  ముఖ్యమంత్రి హస్తిన కు వచ్చారంటే ప్రజలేమి చెవిలో పువ్వులు పెట్టుకోలేదని అన్నారు. పోలవరం పెండింగ్ బిల్లుల గురించి  ఒకవేళ ముఖ్యమంత్రి కలవాలనుకుంటే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శేఖవత్, రైల్వే జోన్ కోసం అయితే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ను కలువాలి. కేసుల గురించి మాట్లాడాలనుకుంటే హోంమంత్రితో సమావేశం కావాలి అన్నారు.

రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేసినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రి నోరు విప్పరు. అయినా, ఆయన పోలవరం గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

సీఎం విచారణకు హాజరవుతారని అనుకోవడం లేదు

కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏప్రిల్ 10వ తేదీన  విచారణకు హాజరు కావలసిందిగా కోర్టు ఆదేశించిందని, అయినా ముఖ్యమంత్రి హాజరవుతారని తాను అనుకోవడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కోడి కత్తి కేసులో తాను దాడి చేయలేదని నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న శ్రీను చెప్పారు. అయితే ముఖ్యమంత్రి పై దాడి చేసింది ఎవరు?. ఎవరైనా దాడి జరిగిన తర్వాత తక్షణ చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతారు.

కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓర్పుగా విమానం లో కూర్చొని హైదరాబాద్ చేరుకొని, అక్కడ స్ట్రెచర్ పై పడుకుని కళ్ళు మూసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. బాబాయి హత్య కేసులో  గుండెపోటు, నారాసుర రక్త చరిత్ర కాదని హత్య చేయించింది ఎవరో  ఒక కొలిక్కి వచ్చినట్లయింది. కోడి కత్తి కేసులో శ్రీనును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్షమించి  ఉద్యోగ అవకాశం కల్పించాలని సూచించారు. లేకపోతే ఆయనకు ప్రాణహాని ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts

మరో పెద్ద సమస్యలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు

Satyam NEWS

సుప్రీం కోర్టు కు రాహుల్

Bhavani

చదువుల తల్లికి క్లాస్ మెట్ క్లబ్ ఆసరా

Satyam NEWS

Leave a Comment