26.7 C
Hyderabad
April 27, 2024 07: 37 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు ముసురు

#Hyderabad Tankbund

తూర్పు- పశ్చిమ shear zone Lat.18.0 deg.N వెంబడి 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఉత్తర ఇంటీరియర్  కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పైన తెలిపిన shear zone తో విలీనం అయ్యింది.

ఝార్ఖండ్, ఆ పరిసర ప్రాంతాలలో 1.5 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది.

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రేపు చాలా చోట్ల, ఎల్లుండి  కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ మరియు వికారాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related posts

మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Satyam NEWS

తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

Satyam NEWS

టోల్ గేట్: కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోతున్నాయి

Satyam NEWS

Leave a Comment