37.2 C
Hyderabad
April 26, 2024 19: 45 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ సీఐ కి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన

Kollapur1

బలహీన వర్గాలకు చెందిన తనను కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి అవమానించారని నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామ సర్పంచ్ బింగి మద్దిలేటి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

సర్పంచ్ మద్దిలేటికి మద్దతుగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్ లు, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేడు కొల్లాపూర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు.

కెఎల్ఐ అతిథి గృహం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు వారు ర్యాలీ నిర్వహించి కొల్లాపూర్ సిఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సోమ శిల గ్రామ ప్రధమ పౌరుడయిన తన పట్ల కొల్లాపూర్ సిఐ అమానుషంగా ప్రవర్తించారని మద్దిలేటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోమశిల ప్రాంతంలో కృష్ణానదిలో చేపపిల్లలను వదిలేందుకు ఆదివారంనాడు రాష్ట్ర మంత్రులు తలసాని నివాసయాదవ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వచ్చారని,

తాను ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు సీఐ అవమానించారని మద్దిలేటి తన ఫిర్యాదులో వివరించారు.

చేప పిల్లలను వదిలేందుకు మంత్రులు లాంచి ఎక్కినప్పుడు తాను కూడా అక్కడకు వెళ్లానని అక్కడ ఎంతో మంది అనధికారులు గుమికూడి ఉన్నారని, అందువల్ల తాను లాంచి ముందే ఆగిపోయానని మద్దిలేటి తెలిపారు.

తన పరిస్థితి చూసిన డిఎస్ పి తనను లాంచి పైకి రావాల్సిందిగా కోరారని ఆయన వివరించారు.

గ్రామ సమస్యలను మంత్రులకు తెలిపేందుకు, వాటిని పరిష్కరించుకోవడానికి వీలు కలిగినందుకు సంతోషిస్తూ తాను లాంచి ఎక్కానని మద్దిలేటి తెలిపారు.

అయితే ఎంఎల్ ఏ బీరం హర్ష వర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు తాను లాంచి దిగి వెళ్లిపోవాల్సిందిగా సీఐ తనకు చెప్పారని మద్దిలేటి అన్నారు.

లాంచిలో ఎలాంటి ప్రోటోకాల్ లేని అనధికారులు ఎంతో మంది ఉండగా సోమశిల గ్రామ ప్రధమ పౌరుడిని అయిన తనను ఎందుకు దించుతున్నారని సీఐ కి తెలిపినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే తన మాటలు పట్టించుకోకుండా సీఐ తనతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారని మద్దిలేటి ఫిర్యాదులో తెలిపారు.

 ప్రోటోకాల్ ప్రకారం తనను దించేందుకు వీలులేదని, అయితే ఎమ్మెల్యే ఆదేశాల పేరుతో తనను గ్రామ ప్రజల ఎదుట తీరని అవమానం చేశారని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా అందుకు విరుద్ధంగా ప్రవర్తించే పోలీసు అధికారుల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తున్నదని మద్దిలేటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తక్షణమే కొల్లాపూర్ సీఐ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

బడుగుబాలహీన వర్గాలకు చెందిన సర్పంచ్ మద్దిలేటి యాదవ్ కు జరిగిన అవమానం ఎవ్వరికి జరగకూడదని గ్రామ సర్పంచ్ లు టీఆర్ ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఉయ్ వాంట్… జస్టిస్ అంటూ వారు చేసిన నినాదాలతో కొల్లాపూర్ ప్రాంతం మారుమోగింది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా ర్యాలీ చేస్తూ తమ వర్గానికి చెందిన సర్పంచ్ కు న్యాయం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

Related posts

సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కు బెదిరింపులు

Satyam NEWS

రేప్:8ఏళ్ళ బధిర బాలికపై 30 ఏళ్ల మృగాడి లైంగికదాడి

Satyam NEWS

గుండె గుభిల్లుమనిపించిన వేంకటరమణ దీక్షితుల డిమాండ్

Satyam NEWS

Leave a Comment