ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ”రాయలసీమ లవ్ స్టోరీ ”. వెంకట్ ,హృశాలి గోసవి ని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన పావని మరో హీరోయిన్ గా నటిస్తోంది . తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20 న రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఈ నెల 27 న రిలీజైన ట్రైలర్ డిజిటల్ మీడియాలో మంచి ఆదరణ పొందుతోంది. నాగినీడు , 30 ఇయర్స్ పృథ్వీ , జీవా , నల్ల వేణు , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , కొమరం , జబర్దస్త్ రాజమౌళి , మిర్చి మాధవి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ , మధుమని తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు .
previous post
next post