ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాదగిరి రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎవరో కిడ్నాప్ చేయడానికి విఫల యత్నం చేశారు. యాదగిరి రెడ్డి ఇంటి నుండి బయటకు రాగానే కొందరు అక్కడికి సమీపంలో కాపుకాచి ఆయనను కిడ్నాప్ చేసే యత్నం చేశారు. కాలని శివారులో 2 కార్లలో వేచి ఉన్న కిడ్నాపర్లు ఒక్కసారిగా యాదగిరి రెడ్డి పై దాడి చేశారు. అయితే అప్రమత్తం అయిన యాదగిరి రెడ్డి తనను లాక్కెళ్లుతున్న దుండగుల నుంచి బలవంతంగా తప్పించుకుని పారిపోయారు. రోడ్డుపై పరుగులు తీస్తూ కేకలు వేస్తూ యాదగిరిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆయన నుంచి ఫోన్ లాక్కుని దుండగులు పరారయ్యారు. మా వెనకాల ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నాడంటూ బెదిరించినట్లు బాధితుడు యాదగిరి రెడ్డి తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
previous post