పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీపై అప్పుడే ఆరోపణల పర్వం మొదలైంది. 2018లో మంత్రిగా ఉన్న
సమయంలో ఓ లేడీ ఐఏఎస్‌కు అసభ్యకరమైన మెసేజ్ పంపారని చరణ్‌జీత్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళా అధికారి పంజాబ్ మహిళా
కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఆమెకు అప్పట్లో చరణ్‌జీత్ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని భావించారు.
తాను దళితుడిని కాబటే టార్గెట్ చేశారని మీటూ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు చరణ్‌జీత్. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక
చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను
తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.
2018 లో చన్నీపై వచ్చిన మీటూ ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేశారు. . దీనిపై ఆందోళన
చేసినా చర్యలేవీ లేకపోగా, తాజాగా అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ సోనియా గాంధీ నేతృత్వంలోని
పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు.