40.2 C
Hyderabad
April 28, 2024 15: 20 PM
Slider కరీంనగర్

వర్షాల పై మంత్రి గంగుల అధికారులతో సమీక్ష..

#ministergangula

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని… రోడ్ల మీద నీళ్ళు నిలువకుండా చర్యలు చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్.. కమిషనర్ గరిమ అగర్వాల్.. మేయర్ వై సునీల్ రావు.. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి లతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్లు కన్సల్టెంట్ సమన్వయ లోపంతో ప్రధాన రహదారిపై నీళ్లు నిలుస్తున్నాయని అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.14.5 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ అధికారులు తప్పిదం కొట్టొచ్చినట్టు కనబడుతుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు… ఆర్&బి అధికారులు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సమన్వయం 14.5 కిలో మీటర్ల రోడ్డుకు ఫూట్ పాత్ కు హోల్స్ వేసి డ్రైనేజి లోకి వర్షం నీరు వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు

కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యధికంగా నిధులు కేటాయించారని ..అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు…  కరీంనగర్ కామారెడ్డి ( కె. కె ఆర్) రోడ్డు పనుల జాప్యంతో రాం నగర్ ప్రధాన రహదారి పై  నీళ్లు నిలిచి.. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని.. మంత్రి గంగుల ఆర్ అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు… సంబంధిత కాంట్రాక్టర్ కు  నోటీసులు అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.. అవసరమైతే బ్లాక్లిస్టులో పెట్టాలని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ,ఆర్ అండ్ బి , విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ ,స్మార్ట్ సిటీ అధికారులు ,కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

లాకప్ డెత్ పై నెల్లూరు ఎస్పీకి సమస్లు

Bhavani

ఎంఎల్సీ ఎన్నికలకు జేడ్పీ హెచ్ సీ పోలింగ్ కేంద్రంపై పోలీసు బాస్ దృష్టి

Satyam NEWS

మునిగిన ఇళ్లకు పరిహారం పంచిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

Leave a Comment