26.2 C
Hyderabad
July 23, 2024 19: 25 PM
Slider నిజామాబాద్

చేసిన పనికి మాకు గుర్తింపు ఇవ్వండి

rtc 05

సమ్మె కాలంలో తాము చేసిన పనికి గుర్తింపు ఇవ్వాలని కామారెడ్డి, బాన్సువాడ డిపోలలో పని చేసిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చే సమయంలో తమకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తమను నిరుద్యోగులుగా ఉంచవద్దని వేడుకుంటున్నారు.

గత 54 రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేపట్టిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. బాన్సువాడ, కామారెడ్డి డిపోలలో పని చేసిన సుమారు 100 మంది కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వాలని చూసారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ ఏవోకు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 54 రోజుల సమ్మెలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఉద్యోగులుగా తాము ఆర్టీసీలో పని చేసామని అన్నారు. సమ్మె కాలంలో తాము చేసిన పనికి గుర్తింపు పత్రాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తమకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.

Related posts

గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన సిరమానోత్సవం..

Satyam NEWS

కొత్తకోట సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి

Satyam NEWS

రక్తదానం చేసి ప్రాణదాతలు గా నిలుద్దాం: జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment