40.2 C
Hyderabad
April 26, 2024 13: 20 PM
Slider కవి ప్రపంచం

జీవనఛాయ

#kondapalliniharini new

కలల దారిలో
అలల ఊహల్లా
వెలుగు బొమ్మలు
అంతరంగ తరంగాలు
కొత్త పాట నెత్తుకున్నప్పుడల్లా
తెలియని అలజడి ఏదో బృంద గానమైపోతున్నది
సల్లాపాలన్నీ విలాప గీతాలు
పెను విషాద చరణాలై
గగనంలో గంభీర ధ్వనులను చేస్తున్నవి
చేతనం జ్వలింప చేసి
కోకిల గానం ప్రవేశింపజేసే
కవి సమయాలు సరిసమానంగా ఉండే
పాటనొక్కటి రాసి పొమ్మంటున్నది
కనబడే కన్నీళ్ళ కన్నా కనిపించని గుండె బరువు
భావవాహినిలో వెన్నెల ఆటలు ఆడుతున్నప్పుడు
ఆకులలో పచ్చ నవ్వులు విరబూసే అడవి అంతా
ఒక యుగాన్ని కొత్తగానే కంటున్నది
నురగలెత్తే వాగులు తెల్ల తెల్లని పలువరసలైనప్పటి
పాత కాలాన్ని తలకు మకుటమై
కపటదారుల పనిపట్ట
హృదయ వీణపై చల్లని రాగం కోసం
పరితపిస్తున్న ది
నూతన వాయిద్యాలు మోగిస్తూ
ఇప్పటి ఓ జ్ఞాపకాల మూటలను ముందరికాళ్ళ బంధాలను చేస్తున్నది
మానవీయ బతుకు నిర్మాణాలలో
నూతన తరాన్ని ఆకాంక్షిస్తున్నది.
ప్రగతిశీల భావాలు జాలువారినట్టు
తొణకని కడలి
రెండవ అలగా ఆదర్శం వెనువెంట రావాలని
నిశ్శబ్ద సౌందర్యంలో నీళ్ళ చప్పుడు విన్నట్టు
ప్రహరీ గోడ మీద దివ్వెలు
తీయని మాటలేవో చెప్పి పొమ్మని అంటున్నా
చెట్టును దాటుకుంటూ గుట్టను దాటుకుంటూ
పట్టపగలే సిరివెన్నెల కురవాలని
ఈ నేల రాలిన పూలు ఈ పాట పాడిన గాలులు
నవజాత శిశువును కంటున్నట్టే ఉన్నది
అవును వెలుగులు విరజిమ్మే నవ్వుతో
ప్రాంగణాలన్నీ విరబూయాలి
క్రొంగొత్త మతాబుల్లో మెరుపులై
రాతి గుండెల పైన చెరగని సంతకమవ్వాలి

డా. కొండపల్లి నీహారిణి

Related posts

కరోనా ఎలర్ట్: నేటి రాత్రి నుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

ధన ప్రవాహంలో హుజూరాబాద్ ను మించిన మునుగోడు

Satyam NEWS

వైసిపి పాలన రైతులకు, వినియోగదారులకు శాపం

Satyam NEWS

Leave a Comment