27.7 C
Hyderabad
April 26, 2024 05: 59 AM
కవి ప్రపంచం

జీవన క్రాంతి

#Sailaja Srinivas

రేగుపళ్ల భోగి పళ్ళు

పాపాయిల కీలకిలలు

ముంగిట్లో రంగవల్లులు

ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు

పరికిణీల్లో పడుచు పిల్లలు

కొత్తల్లుళ్ళ హంగామా

కొంటె మరదమళ్ళ కోలాహలం

హరిదాసుల కీర్తనలు

గంగిరెద్దుల ఆట పాట

గాలి పటాల గగన విన్యాసాలు

ధాన్యపు రాశుల  గల గలలు

పౌష్య లక్ష్మి కి స్వాగతాలు

ప్రకృతి కాంత పరవశాలు

సమిష్టి జీవన ప్రతీకలు

సదాచార నిక్షిప్త నిధులు

సంప్రదాయ లోగిళ్ళు

సనాతన ధర్మ సారథులు

భావి తరానికి సూచికలు 

భవ్య చరితకు తార్కాణాలు

వైజ్ఞానిక నిఘాడాలు

మన భారతీయ పండుగలు

శైలజ రాంపల్లి, 9550258262

Related posts

బోనాలు

Satyam NEWS

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

Satyam NEWS

హిందువంటే..

Satyam NEWS

Leave a Comment