28.7 C
Hyderabad
April 27, 2024 03: 26 AM
కవి ప్రపంచం

పుష్యరాగం

#Ch.Usharani Chandanagar

ఆమె మంచుతెరలలో ఊరేగుతున్న సూర్యునికి దారినిస్తూ 

తెల్లని ముగ్గు గీతలకు రంగుపూలను జోడిస్తుంది

అలికి తీర్చిన గచ్చపై కొన్ని చిక్కుముడులను విప్పుతూ

చుక్కల్ని పేర్చి మెలికలు తిప్పుతూ ఉంటుంది

వెలుగు రాగాలను అద్దుతున్న పిచ్చుకలకు

పెంకుటింటి చూరులో ఒడ్ల ఎన్నులతో విందుచేసి తొలిచూలు పిలగానిలా సాగుతుంది

పిండి ముద్దతో కళారూపాల సృష్టికి తనమునకలవుతుంది

ఉత్తరాయణం కోసం చూస్తుందో

కొండపిండి పూలరెమ్మలతో గొబ్బెమ్మల పదిలంగా పేర్చుకుంటూ

నారాకకై గుండె చప్పుళ్లను వెదజల్లుతుందో

ఎగురుతున్న పతంగులలో నన్ను నాబాల్యాన్ని వెతుకుతుంటుంది

నా పసితనపు పల్లెపాటలను వల్లె వేస్తూ కూనిరాగాలవుతుంది

సీహెచ్. ఉషారాణి, 9441228142

Related posts

నిగర్వి

Satyam NEWS

‘సమ్’ క్రాంతే…

Satyam NEWS

దివ్య దీపోత్సవం!

Satyam NEWS

Leave a Comment