40.2 C
Hyderabad
April 29, 2024 15: 31 PM
Slider కవి ప్రపంచం

శుభకృత్’ కు స్వాగతం

#Viswika Secunderabad

మోడు వారిని ప్రకృతి
చిగురాకుల తోరణాలు కట్టుకుంటుంది
వేప పూల పరిమళం
వాసంత సమీరాలలో
కమ్మదనాన్ని నింపుతుంది
లేత మావి చివురులు
వీరతిలకం దిద్ది కుంటున్నాయి
గండుకోయిలలు
పాటల యాగానికి
గళం సరి చేసుకుంటున్నాయి
రంగు పూల మధ్య చేరి
గుమ్మాలకు ఊగుతున్న
మామిడాకులు కబుర్లతో
కాలక్షేపం చేస్తున్నాయి
షాపుల నుండి వచ్చిన
కొత్తబట్టలు ఇంటిల్లిపాదినీ
అలంకరిస్తున్నాయి
పిందె మామిడిలు కొమ్మల మధ్యన
దాగుడుమూతలు ఆడుకుంటున్నాయి
కరోనా దుమ్ము పట్టిన ప్రపంచం
ఒళ్ళంతా శుభ్రం చేసుకుంటుంది
నవ చైతన్య కిరణాలు
లోకమంతా ప్రసరిస్తున్నాయి
పదాల రుచులతో
కవితా నైవేద్యాన్ని చేసిన కవి
తన ఉగాది కవితా
పచ్చడిని సహ కవులకు
రుచి చూపిస్తున్నాడు
కొత్త వత్సరాన్ని
అనునయంగా పిలుస్తున్నాడు
శుభ సూచకమైన శుభకృతుకు
స్వాగతం పలుకుతున్నాడు

విశ్వైక, సికింద్రాబాదు

Related posts

ఇంజనీర్లను సన్మానించిన ములుగు లయన్స్ క్లబ్

Satyam NEWS

పెరుగుతూనే ఉన్న పెట్రోలు ధర

Satyam NEWS

తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎస్.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment