పీ. వీ.!
ఎన్నెన్నో చదువుల
ప్రోవీ!
అప్పుడే ముగించావా
ఎంతో విలువైన
నీ జీవన మూవీ?
యీ దేశానికి మధురమైన
ఆర్ధిక ఫలాలందించిన
చివురుమ్రావీ!
రాజకీయపుటెత్తుల
భాండాగారానికి
నీవేగా ‘కీ’వి?
ఎందరికో స్ఫూర్తి నిచ్చే
రచనలు చేసిన మేధావి!
ఎన్నెన్నో లలిత కళల్లో ప్రజ్ఞాశాలివి
పలుదేశ ప్రముఖుల
ప్రశంస లందుకున్న
యశస్వీ !
దేశానికి ఎన్నో ఎన్న దగిన.
సేవలందించిన
ధన్యజీవీ!
దీర్ఘాలోచన లో మునిగి
కనుమూశావా?
మౌన తపస్వీ!
పార్టీలో ఇన్ సైడర్ గా
చేసిన సేవలకు
అవుట్ సైడర్ గా
అవుటయ్ పోయావా?
అతి ప్రషస్ విజనరీ!
పర్సానిఫైడ్ వెర్సెటాలిటీ !
ఆర్.దేశిరాజు, హైదరాబాద్