40.2 C
Hyderabad
April 29, 2024 15: 05 PM
Slider కవి ప్రపంచం

శుభమస్తు

#Sandhya Sutrave New

నక్షత్రగమనంతో
సృష్టి మొదలు
యుగారంభానికి ఆది
గిరగిర తిరిగే కాలచక్రం
ఒకటి నుండి అరవైఆకులుగా
ముప్పైఆరవఆకు వద్ద
తొలితెలుగు మాసం
చైత్రశుధ్ధ పాడ్యమిన
శుభం పలుకుతూ
వసంతలక్ష్మి తోడ
మన వాకిళ్ళు పావనంచేయ
ప్రాంతంబట్టి పలుపేర్లతో
ఉగాదిగా,గుడిపాడ్వాగా
అందంగా ఆనందాలు పంచ
మనలోగిలి చేరి పలకరించ మామిడాకులు వేపపూతలతో
తీపి చేదుల మిశ్రమాల
కలబోతగా పలురంగుల
పూలగుత్తుల హంగులతో
వసంత ఋతువు దరహాసంతో మనందరిని మలిచలి నుండి
తొలి వేసవిలోకి ప్రసరింపచేస్తూ
వాత కఫ పిత్త దోషాలను
నియంత్రించి రోగనిరోధక
వ్యవస్థను బలోపేతంచేసే
షడ్రుచుల పచ్చడిని
సేవింపచేయ జీవితానుభవసారం
ఇదియే అని గ్రహింపచేయ
కొత్త కార్యక్రమాలు
ఆరంభింపచేయ
పంచాంగశ్రవణాలతో
భవిష్యద్దర్శనం కావించి
కించిత్ జాగరూకులనుచేయ
“శుభకృతు” పేర శుభమస్తు
అంటూ అందరి సుఖాన్ని
కోరుతూ ఆర్తిగా ఆసక్తి కల్గిస్తూ
అందరి స్వాగతపొందుకై
వేచిచూస్తూ వచ్చిందీ పండుగ.

సంధ్య సుత్రావె, ఫోన్:9177615967, సుల్తాన్షాహి,పాత నగరం, హైద్రాబాద్,500065

Related posts

ఉప శాఖల పంచాయితీ: ప్రజా ధనం వృధా

Bhavani

మొక్కల నాణ్యత పెంచేందుకు స్వచ్చంద ధృవీకరణ

Satyam NEWS

యువ‌త కోసం 20 రోజుల డిజిట‌ల్ మార్కెటింగ్ ఉచిత శిక్ష‌ణ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment