38.2 C
Hyderabad
April 28, 2024 22: 49 PM
Slider కవి ప్రపంచం

గద్దర్ అన్నకి నివాళి

#K.Harinath

బండెనక బండి కట్టి

పదహారు బళ్లు కట్టి

కోట్లమంది ప్రజల హృదయాల్లో

గూడు కట్టుకుని

గుండెల్లో బుల్లెట్ ను దాచుకున్న

గాయక బుల్లెట్ ఓ గద్దర్

ఇది

గుండె పొరల్లోంచి

అగ్నికణాల్లా నిప్పులు కక్కుతూ

ఉబికి వస్తున్న

నిరాజనాక్షరాగ్ని

మంచు సిరా బిందువులు

తన కనురెప్పల సవ్వడికి

కాలి గజ్జెల మువ్వలు కదిలి

కావ్య ఖండికలు తెలంగాణపై

విప్లవోద్యమ గీతికలను

పొడుస్తున్న పొద్దు మీద

నడుస్తున్న కాలమా

పోరు తెలంగాణమా

అలవోకగా అవలీలగా ఆలపించి

తెలంగాణ సాధనలో

ఓ విజయధ్వజమై నిలిచిన

సాహస గాయక శిఖరమా

నీవు నిష్ర్కమించినా

నీ పాటలు మా మస్తిష్కాల్లో

ఎర్రమందారలై పూస్తూనే ఉంటాయి.

అనునిత్యం

మా హృదయాల్లో నీవు

మౌన ముద్రవై నిలిచి వుంటావులే

కొరుప్రోలు హరనాథ్, 9703542598

Related posts

అనుమానంతో భార్య ను హత్య చేసిన వ్యక్తి

Bhavani

ఈవీఎం గోదాం పరిశీలన

Murali Krishna

‘యశోద’లో కథే హీరో: వరలక్ష్మీ శరత్ కుమార్

Satyam NEWS

Leave a Comment