39.2 C
Hyderabad
April 28, 2024 14: 06 PM
Slider సంపాదకీయం

స్ట్రగుల్: పది లక్షల మంది నిరాహార దీక్ష, లక్ష మంది ఢిల్లీ యాత్ర

amaravathi

ఆంధ్రప్రదేశ్ బిజెపి అమరావతి రాజధాని కోసం పోరాడుతున్నట్లు చెబుతున్నా కేంద్రంలోని బిజెపి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని అమరావతి రైతులు భావిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట తప్పిన దానికన్నా ఇది ఘోరమైన తప్పిదంగా వారు అంటున్నారు.

రెండో సారి బిజెపి తప్పు చేస్తే పవన్ కల్యాణ్ తో కలిసి వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిజెపిని నమ్మే పరిస్థితి ఉండదని వారు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ కుదేలైపోయిన ఈ స్థితిలో బిజెపి జనసేన పుంజుకోవడానికి ఎంతో అవకాశం ఉందని, ఇలాంటి పరిస్థితిని బిజెపి చేజేతులా కోల్పోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి రాజధానిగా ఉండేలా చేస్తే మధ్య ఆంధ్ర, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, రాయలసీమ ప్రాంతం మొత్తం బిజెపి వైపు నడిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితులను బిజెపికి తెలియ చెప్పేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అమరావతి జేఏసీ కొన్ని ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నది.

పది లక్షల మందితో ఒకే రోజు నిరాహార దీక్ష, లక్ష మందితో ఢిల్లీ యాత్ర చేపట్టాలని అమరావతి రైతులు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా మూడు వేల మంది రైతులపై వివిధ రకాల కేసులు పెట్టింది. అందులో ఎక్కువగా మహిళా రైతులు ఉన్నారు.

ఏ ఉద్యమంలో కూడా విధ్వంసం ఎక్కువ జరిగిన సందర్భాలలో కూడా ఇన్ని కేసులు నమోదు కాలేదు. కావు కూడా. అలాంటిది ఒక్క చోట కూడా విధ్వంసం జరగకపోయినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా కూడా ఇంత పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు నమోదు కావడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దం పడుతున్నదని అమరావతి రైతులు అంటున్నారు.

ముఖ్యమంత్రిని, మంత్రులను దూషించారనే ఆరోపణలతో ఇప్పటికి దాదాపుగా 100 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అదే తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టు పార్టీల వారిని వైసిపి మంత్రులు, వైసిపి ముఖ్య నాయకులు బండ బూతులు తిడుతున్నా, సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నా, ప్రతిపక్ష నాయకుల పర్యటలపై దాడులు చేస్తున్నా కేసులు నమోదు కావడం లేదు. కొన్ని చోట్ల కేసులు నమోదు అయినా స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెడుతున్నారని అమరావతి రైతులు అంటున్నారు. ఇలాంటి కేసులన్నింటిని ప్రత్యేకంగా విశ్లేషణ జరిపి మానవహక్కుల సంఘాలకు నివేదించాలని అనుకుంటున్నారు. పది లక్షల మందితో నిరాహార దీక్ష, లక్ష మందితో ఢిల్లీ యాత్ర విజయవంతం అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో కదలిక రావచ్చునని అమరావతి జేఏసీ నాయకులు కొందరు భావిస్తున్నారు.

Related posts

రాజధాని గ్రామాల మహిళలపై పోలీసు దాడి అమానుషం

Satyam NEWS

కోయ ప్రసాద్ రెడ్డి వెనక ఉన్నది ఎవరు?

Satyam NEWS

మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం

Satyam NEWS

Leave a Comment