28.7 C
Hyderabad
April 27, 2024 04: 05 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో క్విట్ ఇండియా స్ఫూర్తితో నిరసన

Kollapur Dharna

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “కిట్ ఇండియా స్ఫూర్తితో  సేవ్ ఇండియా”పిలుపులో భాగంగా ఈరోజు కొల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర సిపిఎం పార్టీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో “జైల్భరో” నిరసన కార్యక్రమం చేశారు.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి శివవర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోకరోనా ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. దేశంలో కరోనా వైరస్ తో ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న సందర్భంలో ప్రజలను ఆదుకోవడం మానేసి, కోట్ల బడ్జెట్ తో దేవాలయాలు కట్టడం విడ్డూరమన్నారు.

కరోనా ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్రంలో కరోనా టెస్టులను విస్తృతంగా జరిపి కరోనా నివారించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. కష్టకాలంలో ఉన్న ప్రజానీకాన్నికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు తో సంబంధం లేకుండా పది కేజీల బియ్యం ఇవ్వాలని ఆయన అన్నారు.

రైతులకు ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని  వంద రోజుల పనిదినాలను 200 రోజులు పెంచి ప్రతి ఒక్కరికీ పనికి కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధప్రజాసంఘాల నాయకులు, సి ఐ టి యు, ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ, రజక వృత్తిదారుల సంఘం, గిరిజన సంఘం, ఆవాజ్, ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, ఏం తారా సింగ్, గిరిజన సంఘం మండల నాయకులు ఎం భాస్కర్ నాయక్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు, జల్లాపురం సురేందర్, ఆవాజ్ సంఘం నాయకులు ఎండి ముంతాజ్ అలీ, ఎండి సలీం,swf, మధుసూదన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలస్వామి, సాయిలు ,చంద్రయ్య ,స్వామి పుల్లయ్య ,రామస్వామి, కెవిపిఎస్  నాయకులు, రాజు, మధు తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

పది రోజుల్లో ప్రతి ఇంటి ముందు పండ్ల మొక్కలు నాటాలి

Satyam NEWS

రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన….

Satyam NEWS

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ కు సీఎం  జగన్‌ అభినందన

Satyam NEWS

Leave a Comment