32.7 C
Hyderabad
April 27, 2024 02: 13 AM
Slider ప్రకాశం

సుబ్బారావు గుప్తా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

#subbaraogupta

ప్రకాశం జిల్లా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సుబ్బారావుగుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తా గతంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించగా ఆయన అనుచరులు సుబ్బారావు గుప్తాను ఒక లాడ్జిలో పట్టుకుని చితక్కొట్టారు. చితక్కొట్టడమే కాకుండా అతడిని మోకాళ్లపై కూర్చోబోట్టి మంత్రికి క్షమాపణ చెప్పించి దాన్ని వీడియో తీసి విస్తృతంగా ప్రచారం చేశారు.

ఆ తర్వాత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సుబ్బారావు గుప్తా కు మతి స్థిమితం లేనట్లు ఆయన కుటుంబ సభ్యులే చెప్పారని కూడా అన్నారు. ఆ తర్వాత సుబ్బారావు గుప్తా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత సబ్బారావు గుప్తా ఢిల్లీ వెళ్లి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుతో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చింతామణి నాటకంపై నిషేధం విధించడాన్ని కూడా సుబ్బారావు గుప్తా ఖండించారు.

వైసీపీలో ఉంటూనే పార్టీ నాయకులను విమర్శిస్తున్న సుబ్బారావు గుప్తా ఇప్పుడు మళ్లీ వార్తలకెక్కారు. పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా బుధవారం గుప్తాతో పాటు మరికొంతమంది ఒంగోలులో మేయర్‌ గంగాడ సుజాత చాంబర్‌లోకి వెళ్లారు.

ఇక్కడ పొట్టిశ్రీరాములు విగ్రహం ఉండాలి, దానికి పాలాభిషేకం చేయాలంటూ హడావుడిచేశారు.  అయితే, ఇక్కడ విగ్రహం ఉందా, అమ్మేసుకున్నారా.. అంటూ ఇష్టారీతిన దుర్భాషలాడారని, దళిత మహిళనని చెప్పినా వినకుండా తన మనసు గాయపడే విధంగా దూషణలకు దిగారని మేయర్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ కేసుతోపాటు మరో 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఒంగోలు వన్‌టౌన్‌ సీఐ సుభాషిణి తెలిపారు. అయితే గుప్తాను కేసు లో ఇరికించడానికి గతంలో జరిగిన ఉదంతాలను స్థానికులు ప్రస్తావిస్తున్నారు. గతంలో మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు తదితరులపై సుబ్బారావుగుప్తా ఘాటైన వ్యాఖ్యలు చేయడం, తర్వాత జగన్‌ పుట్టినరోజున కేక్‌ కటింగ్‌.. దీంతో సమస్య సద్దుమణిగి రాజీపడడం జరిగాయి.

రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మంత్రి బాలినేనితో పాటు ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిని తిట్టడమే కాకుండా వారి ఉదంతాలను చూపిస్తూ సినిమా కూడా తీస్తానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే కొందరు పెద్దలు గుప్తాను అట్రాసిటీ కేసులో ఇరికించారని తెలుస్తోంది.

Related posts

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నారాయణ

Murali Krishna

కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్న జగన్

Bhavani

శాసనమండలి ఎన్నికల్లో నవతరంపార్టీ పోటీ

Satyam NEWS

Leave a Comment