27.7 C
Hyderabad
April 26, 2024 05: 48 AM
Slider పశ్చిమగోదావరి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సత్వరమే పరిష్కరించాలి

#eluru

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం లేకుండా త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని సంబంధిత అధికారులకు ఏలూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కె. పెంచల కిషోర్ ఆదేశించారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం ఆర్డిఓ కె. పెంచల కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు ఆయా కేసుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు జరిగిన లబ్దిపై కమిటీ సభ్యులు చర్చించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి ఎస్సీ, ఎస్టీలతో పాటు మిగతా ప్రజానీకానికి అవగాహన కల్పించాలన్నారు.  ఇందుకు సంబంధించిన ఫెక్ల్సీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు యం. అజయ్ బాబు, ప్రవల్లిక, డివిజన్ మెంబర్లు డి అబ్రహాం, రవిజైన్, ఉయ్యాల అప్పారావు, ఏలూరు ఎఎస్ డబ్ల్యూఓ కె. త్రిమూర్తులు, ఉంగుటూరు, కైకలూరు సహాయ సాంఘీక సంక్షేమ అధికారులు, పోలీసు, రెవిన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related posts

కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

Murali Krishna

హుజూర్ నగర్ గ్రంథాలయ నూతన కమిటీ నియామకం

Satyam NEWS

రెజర్లకు మద్దతుగా సంతకాల సేకరణ

Bhavani

Leave a Comment